ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను”

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన
“కమిటీ కుర్రోళ్లు” మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా “అదే నీవు అదే నేను”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. “అదే నీవు అదే నేను” సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

“అదే నీవు అదే నేను” సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ “1 మిలియన్ వ్యూస్” తో డిజిటల్ మీడియాలో దూసుకెళ్తోంది. స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ చేతుల మీదుగా లాంఛ్ చేసిన మనసా మనసా సాంగ్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఈ చిత్రం నుంచి మధురమా పాటను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ పూరి, నటి ఇంద్రజ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. ఇలా చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖుల బెస్ట్ విశెస్ అందుకున్న “అదే నీవు అదే నేను” సినిమా మీ సమీప థియేటర్స్ లో రిలీజ్ కు వస్తోంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తిని పంచేలా ఈ సినిమా ఉండబోతోంది. “అదే నీవు అదే నేను” సినిమా విజయంపై మూవీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు – త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వి నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
లిరిక్స్ – పూర్ణాచారి
డైలాగ్స్ – వై.అమ్మిరాజు
డీవోపీ – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
మ్యూజిక్ – కనిష్క
ప్రొడ్యూసర్ – కాండ్రేగుల గోవిందు
స్క్రిప్ట్, డైరెక్షన్ – కొండల్

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

2 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

3 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

3 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

3 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

3 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

8 hours ago