ఆగస్ట్ 1న రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్

హీరో సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ట్రైలర్

మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ధ శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గతంలో ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎలాంటి ఒత్తిడులు, భయాలకు లొంగకుండా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ రెండు చిత్రాలు సంచలనం సృష్టించాయి. నటీనటులు తమ, తమ పాత్రలలో ఒదిగిపోయిన విధానం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ , అప్పట్లో ఆయన ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిత్రాలకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఈ రెండు పార్ట్ చిత్రాలు ఒకే ఏడాది అనగా 2010లో వరుసగా విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ‘రక్త చరిత్ర’ పార్ట్-1 చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేయగా…హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి స్పందన రావడంతో ఇప్పుడు ‘రక్త చరిత్ర’ పార్ట్-2 చిత్రాన్ని ఆగస్ట్ 1న థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర అంటూ సాగే నేపథ్య గీతంతో పాటు కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అనే మరో పాటతో కలుపుకుని కథానుసారం సందర్భానుసారమైన రెండు పాటలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని చాలా రోజులుగా ప్రేక్షకులు కోరుతుండటంతో పాటు నేటితరం యూత్ కు కూడా వాస్తవిక కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ‘రక్త చరిత్ర’ పార్ట్-2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వంకాయపాటి మురళీకృష్ణ, నట్టి లక్ష్మి కరుణ, నట్టి క్రాంతి నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

3 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

4 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

4 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

4 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

4 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

10 hours ago