“రాజా సాబ్”ఈ నెల 16న టీజర్ విడుదల

Must Read

డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్”, ఈ నెల 16న టీజర్ విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు “రాజా సాబ్” టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు “రాజా సాబ్” రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

“రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. “రాజా సాబ్” సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.

నటీనటులు – ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

Latest News

‘బకాసుర రెస్టారెంట్‌’ నుంచి అయ్యో ఏమీరా ఈ జీవితం సాంగ్‌ను ఆవిష్కరించిన బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష...

More News