పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ‘ హూ’ చిత్రం..

Must Read

జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన చిత్రం ‘ ‘హూ’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా డబ్బింగ్, ఎడిటింగ్, వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ బాలాజీ. కే మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ’ హూ’.ఈ చిత్రంలో జెడి చక్రవర్తి గారి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది.

ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్ కి రెడీ అవుతుంది. సంగీతం పరంగా ఈ చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.

జెడి చక్రవర్తి, శుభ, నిత్య, వినయ్ ప్రసాద్, విజయ్ చందరం, సునీల్ పూర్ణిక్, రమేష్ పండిట్, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్, నాగేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి

సంగీతం: ఈశ్వర్ చంద్
ఎడిటింగ్: జెడి చక్రవర్తి
కెమెరా: MB అల్లికట్టి
విజువల్ ఎఫెక్ట్స్: చందు
ప్రొడ్యూసర్: రెడ్డమ్మ బాలాజీ కె
దర్శకత్వం: జేడీ చక్రవర్తి
పి ఆర్ ఓ : బీ.వీరబాబు

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News