‘ఓరి దేవుడా’ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్

‘ఏమ‌ని అనాల‌ని తోచ‌ని క్ష‌ణాలివి
ఏ మ‌లుపు ఎదురయ్యే ప‌య‌న‌మిదా
ఆమ‌ని నువ్వేన‌ని నీ జ‌త చేరాల‌ని
ఏ త‌ల‌పో మొద‌ల‌య్యే  మౌన‌మిదా…ఔన‌న‌వా ఔన‌న‌వా..’

 అంటూ ప్రేమికుడు త‌న ప్రేయ‌సికి మ‌న‌సులోని మాట‌ల‌ను పాట రూపంలో  చెబితే ఎలా ఉంటుంది.. మ‌న‌సుకు హ‌త్తుకుంటుంది. ఇంత‌కీ ఆ ప్రేమికుడు ఎవ‌రో కాదు.. అశోక్ సెల్వ‌న్‌. ఇంత‌కీ ఆయ‌న త‌న ప్రేమ‌ను ఎవ‌రికీ చెప్పాడో తెలియాలంటే ‘ఓరి దేవుడా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు నిర్మాత ప్ర‌సాద్ వి.పొట్లూరి.

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తన్నారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఓరి దేవుడా’ దేవుడా చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.  దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ ‘ఔననవా..’ అంటూ సాగే మెలోడి సాంగ్ విడుదల చేసింది. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు.  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ రాశారు. విజ‌య్ ఈ చిత్రాన్ని ఎడిట‌ర్‌గా, విదు అయ్య‌న్న సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Attachments area

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago