హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ రెండవ రోజు నీరుస్ న్యూ వెడ్డింగ్ కలెక్షన్స్ లో బాలీవుడ్ నటి చిత్రన్గదా సింగ్ మరియు విక్రమ్ ఫండింస్(Vikram Phadins) కలెక్షన్స్ లతో సినీనటి శ్రియా శరన్ ర్యాంపుపై మెరిసిపోయారు….
బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‘ రెండవ రోజు కూడా ఆకట్టుకుంది.
అరబిందో రియాల్టీ సమర్పణలో రెండు వ రోజు ఫ్యాషన్ వీక్ లో భాగంగా హిమయత్నగర్ INIFD ఫ్యాషన్ స్టూడెంట్స్ తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తులను మోడల్స్ ర్యాంపు పై అదుర్స్ అనిపించారు.
నీరుస్ న్యూ వెడ్డింగ్ కలెక్షన్స్ లో మోడల్స్ తో పాటు బాలీవుడ్ నటి చిత్రన్గదా సింగ్ ర్యాంపుపై మెరిసిపోయారు ప్రదర్శనలో భాగంగా రాజ్యలక్ష్మి గుబ్బ,
మాధవి హాండ్ క్రాఫ్ట్స్, STHRI స్త్రీ, అశోక్ మానయ్ (Ashok Maanay) మరియు స్వాతి వెలదండి మరియు ప్రముఖ డిజైనర్ విక్రమ్ ఫాదనిస్(vikram Phadnis) లకు చెందిన డిజైన్ కలేషన్స్ లో సినీనటి శ్రేయ శరన్ షో స్టాపర్ గా నిలిచింది. డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను ఈ రెండు వ రోజు ర్యాంపుపై మోడల్స్ సందడి చేశారు