9 రోజుల్లో 100 కోట్ల “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)

Must Read

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా గత నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసింది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మొత్తం వరల్డ్ వైడ్ గా 1720 స్క్రీన్స్ లో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ప్రదర్శితమవుతోంది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టిందీ సినిమా. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతోంది.

“ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
నిర్మాణం – విజువల్ రొమాన్స్
దర్శకత్వం – బ్లెస్సీ

Latest News

Hombale Films and Prabhas Sign Landmark A New Era For Indian Cinema

Hombale Films and Prabhas all set to join forces for three mega films, set to redefine entertainment on the...

More News