ఓ చెలియా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

Must Read

హీరోయిన్ కావేరి కర్ణిక మాట్లాడుతూ నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ సార్ కి నా కృతజ్ఞతలు. ఈ ఓ చెలియా స్టోరీ లైన్ చాలా భాగా ఉంది. నాకు హీరోయిన్ గా సక్సెస్ ఇస్తాది అని గెట్టి నమ్మకం ఉంది. ఇందులో సాంగ్స్ చాలా చాలా భాగా ఉన్నాయి . ఇందులో నన్ను కెమరామెన్ సార్ చాలా అందంగా చూపించారు. మా హీరో నాగ ప్రణవ్ మొదటి సారి యాక్టింగ్ చేస్తునట్టు అనిపించదు. ఎంతో భాగా చేశారు. నాతో పాటు ఆక్ట్ చేసిన ఆర్టిస్టు లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు…

హీరో నాగ ప్రణవ్ మాట్లాడుతు తెలుగు సినిమాకి నా కి సరైన కథ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో వచ్చింది ఓ చెలియ… చాలా అద్భుతమైన లవ్ స్టోరీనీ డైరెక్టర్ రెడ్డి సార్ చెప్పారు . చాలా మంచి సాంగ్స్ తో తొందరలో మీ ముందుకు వస్తున్నాం, ఆడియెన్స్ ను మా ఓ చెలియా అలరిస్తుంది అని మాకు నమ్మకం ఉంది. . . నాతోపాటు ఆక్ట్ చేసిన ఆర్టిస్టు లందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

సీనియర్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు ఇందులో ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చేయని వెరైటీ స్పెషల్ రోల్ చేస్తున్నారు. చాలా భాగా సపోర్ట్ చేశారు. కుడితి శ్రీనివాస్ గారు సతీష్ గారు చాలా భాగా సపోర్ట్ చేశారు. మా ఇంకో హీరోయిన్ ఆధ్య ఎంతో భాగా ఆక్ట్ చేసింది . డైలాగ్స్ కి పర్ఫెక్ట్ ఎక్రెషన్స్ ఇస్తూ సింగిల్ టేక్ లొ కంప్లీట్ చేస్తూ భాగా సపోర్ట్ చేసింది అన్నారు. స్టోరీ గురించి చెప్పుతూ ఓ చెలియా ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
కుడితి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి నాకు మంచి రోల్ ఇచ్చారు. ఓ చెలియా స్టోరీ లైన్ చాలా భాగా ఉంది అని ఎక్కడ సీన్ విషయం లో కాంప్రమైజ్ అవ్వకుండా ఔట్పుట్ వచ్చేంత వరకు నీట్గా ఎక్సప్లెయిన్ చెసి ఔట్పుట్ రాబట్టుకొనేవాడు అని డైరక్టర్ గురించి చెప్పారు. సతీష్ గారు మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు ఎన్నో మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను .

గానీ ఎప్పడూ చేయని క్యారక్టర్ ఇందులో చేస్తున్నా . నాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ ట్యూన్ విషయం లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి ట్యూన్స్ నీ నా నుండి రాబట్టుకొన్నారు. నాకు ఈ ఛాన్స్ డైరక్టర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కెమెరామెన్ సురేష్ బాల మాట్లాడుతూ డైరెక్టర్ నాగ రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఈ ఛాన్స్ ఇచ్చి తెలుగు లో కెమెరామెన్ గా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. చాలా మంచి స్టోరీ లైన్ ఇది. కచ్చితం గా సక్సెస్ అవుతాది నమ్మకం ఉంది అన్నారు. సునీల్ రావినూతల మాట్లాడుతూ డైరెక్టర్ రెడ్డి గారు మంచి డిఫరెంట్ కామెడీ రోల్ ఇంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఐశ్వర్య నాయుడు, తన్వి,అమ్మరమేష్ , పెద్దిరాజు, తన్మయ, స్వప్న, దాస్, తదితరులు ఆక్ట్ చేశారు.

ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ ,: రామ్, దుర్గేశ్, మోహనకృష్ణ, ఫైట్ మాస్టర్స్ : అశోక్ , రాజేష్ లంక, ఎడిటర్ : ఉపేంద్ర , ఆర్ట్ డైరెక్టర్: భూపతి యాదగిరి, అసిస్టెంట్ డైరెక్టర్: దుర్గ,ప్రసాద్
పి ఆర్వో.: B. వీరబాబు, నిర్మాతలు:, రూపా శ్రీ, చంద్రమౌళి
కద, స్క్రీన్ ప్లే, దర్శకత్వం :: నాగ రాజశేఖర్ రె

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News