“తమ్ముడు” మూవీలో పవర్ ఫుల్ వుమెన్ క్యారెక్టర్స్ చూస్తూ మహిళా ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారు, ఈ సినిమా ఆడియెన్స్ కు బిగ్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది – హీరోయిన్ సప్తమి గౌడ

Must Read

“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తో పాటు రత్న క్యారెక్టర్ లో నటించిన తన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరోయిన్ సప్తమి గౌడ.

  • కాంతార సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు గారి దగ్గర నుంచి “తమ్ముడు” మూవీ కోసం కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. లుక్ టెస్ట్ లో ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. హార్స్ రైడింగ్ నేర్చుకోమని చెప్పారు. అరకులో షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. “తమ్ముడు” మూవీకి వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది.
  • అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. నా క్యారెక్టర్ కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్ గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. “తమ్ముడు” కాస్త సీరియస్ సబ్జెక్ట్..ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్ గా ఉంటాను. అది ఆడియెన్స్ కు హ్యూమర్ ఇస్తుంది. రత్న రేడియో జాకీ కాదు. తను పాత్ర ఎలా ఉంటుందో మూవీలో చూడాలి. కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.
  • పవన్ కల్యాణ్ గారి తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. వేణు గారు చెప్పారు. ఆ సినిమాతో పవన్ గారు ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చారో మనందరికీ తెలుసు. నేను కంప్లీట్ మూవీ చూడలేదు. మా మూవీ రిలీజ్ లోపు పవన్ గారి తమ్ముడు మూవీ చూస్తాను.
  • “తమ్ముడు” సినిమా నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. ఈ చిత్రంలో నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేప్పుడు మిగతా వాటి కంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.
  • “తమ్ముడు”లో నేను, లయ, దిత్య, వర్ష, స్వసిక..ఇలా మా అందరి క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. మా ఐదు వుమెన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా, పవర్ ఫుల్ గా ఉంటాయి. గుత్తి క్యారెక్టర్ చూస్తే బస్ డ్రైవ్ చేస్తుంది. తను బస్ డ్రైవింగ్ ఈ మూవీ కోసం నేర్చుకుంది. లయ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు. నేను, వర్ష..ఇలా మా అందరికీ ఫైట్ సీక్వెన్స్ లు ఉంటాయి. సినిమాల్లో హీరోతో సాంగ్స్ పాడే హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. కానీ ఇందులో ఫైట్ చేసే హీరోయిన్స్ ను చూస్తారు. వుమెన్ క్యారెక్టర్స్ ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్స్ లో “తమ్ముడు” సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు.
  • ఈ మూవీలో నితిన్ తో నాకు లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. దిల్ రాజు గారి ఎస్వీసీ సంస్థలో నా ఫస్ట్ తెలుగు మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఒక సినిమా బాగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలంటే మంచి సంస్థలకే సాధ్యమవుతుంది. డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు “తమ్ముడు” మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి క్యారెక్టర్ ను పక్కాగా డిజైన్ చేసుకున్నారు. ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ నుంచి కూడా తనకు కావాల్సిన ఔట్ పుట్ కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు.
  • బిగ్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం “తమ్ముడు” మూవీని చూడండి. మీరు ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ చూస్తే సినిమా ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో తెలుస్తుంది. ఇంట్లో ఇలాంటి సినిమా చూస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. థియేటర్ లోనే “తమ్ముడు” చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
  • నాకు కమర్షియల్ మూవీస్ చేయడం ఇష్టమే. “తమ్ముడు” కూడా కమర్షియల్ మూవీనే. పుష్ప లో రశ్మిక చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కాంతార సక్సెస్ తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాల్లో మీకు నేను కనిపించకపోవడానికి కారణమదే. డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతో పాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా. వాటి డీటెయిల్స్ త్వరలో వెల్లడిస్తా. భాషాలకు అతీతంగా అన్ని చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News