‘ది ఢిల్లీ ఫైల్స్’ ఇండిపెండెన్స్ డే 2025న రిలీజ్

సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ది తాష్కెంట్ ఫైల్స్, ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ వంటి అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలను రూపొందించిన తర్వాత, మరొక సంచలనమైన ప్రాజెక్ట్ ‘ది ఢిల్లీ ఫైల్స్’ కోసం పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌తో మరోసారి చేతులు కలిపారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు, బాక్సాఫీస్ విజయాన్ని అందుకున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో పాటు జాతీయ అవార్డు గెలుచుకున్న కార్తికేయ 2, విమర్శకుల ప్రశంసలు పొందిన గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

‘ది ఢిల్లీ ఫైల్స్’ అనౌన్స్ మెంట్ నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. తాజాగా మేకర్స్ రెండు పార్ట్స్ గా రూపొందుతున్న దిల్లీ ఫైల్స్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ది ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ చాప్టర్ 15 ఆగస్టు 2025న విడుదలవుతుందని వివేక్ వెల్లడించారు.

సోషల్ మీడియాలో, వివేక్ రంజన్ అగ్నిహోత్రి విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఢిల్లీ ఫైల్స్ – ది బెంగాల్ చాప్టర్ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. “మార్క్ యువర్ క్యాలెండర్. ఆగస్టు 15, 2025. సంవత్సరాల రిసెర్చ్ తర్వాత, #TheDelhiFiles పవర్ ఫుల్ కథ. చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని ప్రజెంట్ చేస్తూ బెంగాల్ చాప్టర్ – రెండు భాగాలలో మొదటిది – మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. #RightToLife .” అని ట్వీట్ చేశారు. 

వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన సినిమా కోసం సమగ్రమైన సమాచారాన్ని సేకరించడానికి కేరళ నుండి కోల్‌కతా, ఢిల్లీ వరకు చాలా దూరం ప్రయాణించి విస్తృత పరిశోధనలు చేశారు. అతను తన చిత్రానికి వెన్నెముకగా నిలిచే చారిత్రక సంఘటనలకు సంబంధించిన 100 పుస్తకాలు  200 కంటే ఎక్కువ కథనాలను చదివి సమాచారాన్ని సేకరించారు. అతను, టీం పరిశోధన కోసం 20 రాష్ట్రాలలో పర్యటించారు, 7000+ రిసెర్చ్ పేజీలు, 1000 పైన ఆర్కైవ్ చేసిన కథనాలను అధ్యయనం చేశారు.

దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న తర్వాత, వివేక్ రంజన్ అగ్నిహోత్రి అప్ కమింగ్ ‘ది ఢిల్లీ ఫైల్స్’తో మరో సెన్సేషనల్ మూవీ జర్నీలో  ప్రేక్షకులను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.  

ఢిల్లీ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పల్లవి జోషి బ్యానర్‌పై రూపొందుతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ & ఐ యామ్ బుద్ధ సమర్పణలో ఈ చిత్రం ఆగస్ట్ 15, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago