అమెరికాలోని డల్లాస్‌లో విడుదలైన ‘రహస్యం ఇదం జగత్‌’ టీజర్‌

కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. నవంబరు 8న చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్‌ల్‌ కంటెంట్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు మేకర్స్‌.

తొలిసారిగా ఓ తెలుగు చిత్రం అమెరికాలో టీజర్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. డల్లాస్‌లోని యూనివర్శిటి ఆఫ్‌ టెక్సాస్‌ డల్లాస్‌లో జరిగింది. అక్కడ వున్న క్యాంపస్‌ మూవీ థియేటర్‌లో టీజర్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకలో యూనివర్శిటి స్టూడెంట్స్‌తో పాటు అమెరికాలోని సినీ ప్రేమికులు, తానా నాటా అసోసియేషన్‌ ప్రతినిథులతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్‌ సభ్యులు కూడా హాజరయ్యారు. ఇప్పటి వరకు యూఎస్‌లో ఇలాంటి ఫంక్షన్‌ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున్న ఆడియన్స్‌ హాజరయ్యారు. ఇక టీజర్‌ను గమనిస్తే సైన్స్‌ ఫిక్ష్‌న్‌కు మైథాలాజికల్‌ అంశాలతో పాటు థ్రిల్లింగ్‌ అడ్వెంచెరస్‌ను ఇండియన్‌ హిస్టారికల్‌ అంశాలను వెలికితీసే టీమ్‌కు ఎదురైన పరిస్థితులతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా అనిపిస్తుంది. టీజర్‌ చూస్తుంటే అందరిలో సినిమాపై మంచి బజ్‌, ఇంట్రెస్ట్‌ కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఇలాంటి విభిన్నమైన, కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలనే నేడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ ”మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ అంశాలకు మంచి ట్విస్ట్‌లు జోడించి ఈ చిత్రం రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్‌ అందరికి గూజ్‌బంప్స్‌ తీసుకొచ్చే విధంగా వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.

తారాగణం: రాకేష్ గలేభే, స్రవంతి ప్రత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ కందాల, శివ కుమార్ జూటూరి, ఆది నాయుడు, ఏబెల్ కోసెంటినో, టామ్ అవిలా, లాస్య రవినూతుల.
కోమల్ ఆర్ భరద్వాజ్: రచన & దర్శకత్వం
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టేలర్ బ్లూమెల్
సంగీతం: గ్యాని
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
రచయిత: రవితేజ నిట్ట
డైరెక్షన్ టీమ్: వరుణ్ వేగినాటి, రవితేజ నిట్టా, భార్గవ్ గోపీనాథం, నవ్య దీపికా భత్తుల, ఆశిష్ చైతన్య, అనీషా క్రోతపల్లి
బ్యానర్: సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్
నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల
ప్రొడక్షన్ డిజైనర్: జెఫ్రీ స్టిల్వెల్
సినిమాటోగ్రఫీ బృందం: టేలర్ స్టంప్, మైఖేల్ వీస్, డామియన్ బైంగ్టన్, జెస్సీ బర్రిల్, నిక్ గ్రిల్, , పాట్రిక్ బ్లెవిన్స్, లోగాన్ రేనాల్డ్స్.
హెయిర్ & మేకప్: ఎరిన్ లియోన్, ట్రిస్టా కెల్లీ, ఎలెన్ మక్ర్ట్చ్యాన్
సౌండ్ రికార్డింగ్: నికోలస్ డెకర్, ట్రాయ్ మిచెయు
కాస్ట్యూమ్ డిజైనర్: అనురాధ సాగి
VFX కంపెనీ/సూపర్‌వైజర్: హ్యూ పిక్చర్స్/హేమంత్ వుండేమొదలు
యానిమేషన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: డి స్క్వేర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్/విజయ్ సాగర్ అన్నారపు
లేబుల్: డివో మ్యూజిక్
పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago