టాలీవుడ్

నచ్చింది గర్ల్ ఫ్రెండూ..ప్రేక్షకులకు నచ్చుతుంది..దర్శకుడు శశికిరణ్

అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై పై ఉదయ్ శంకర్, జెన్నీఫర్ జెన్నీఫర్ ఇమ్మాన్యూయెల్ జంటగా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండూ”..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 11న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి మేజర్ చిత్ర దర్శకులు శశికిరణ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం .

గెస్ట్ గా వచ్చిన దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూసిన తరువాత ఇందులో నవ రసాలు ఉండేలా చాలా బాగా తీశారు..ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చడమే కాకుండా కచ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది.ఇందులో నటించిన వారందరూ చాలా బాగా నటించారు. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ.. వైజాగ్ నేపథ్యంగా థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగే లవ్ స్టోరి ఇది. సినిమాలో ఆహ్లాదకరమైన ప్రేమ కథతో పాటు ఆసక్తిని పంచే థ్రిల్లింగ్ అంశాలున్న ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ డెడికేటెడ్ తో వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న మా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ”.. సినిమాను ప్రేక్షకులందరూ అందరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. 11.11.22 న మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న “నచ్చింది గర్ల్ ఫ్రెండూ”..సినిమా పై మాకు పూర్తి నమ్మకం ఉంది. కంటెంట్ బాగుంటే ఎ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ సినిమా తియ్యడం జరిగింది.ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు చూసిన ప్రేక్షకులందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదములు అన్నారు.

చిత్ర హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. మా సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇందులోని పాటలకు ప్రేక్షకులకు బాగా నచ్చాయి.. డైరెక్టర్ గురుపవన్ చాలా బాగా తీశాడు.మార్నింగ్ నుండి ఈవెనింగ్ వరకు జరిగే ఈ స్టోరీ లో ఎక్కడ ల్యాగ్ ఉండదు.అలాగే చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా రెండు గంటలు కచ్చితంగా ఎంగేజ్ చేసేలా తీయడం జరిగింది.నాది, హీరోయిన్ లా కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో, నాది, మదునందన్ అంత కంటే బాగుంటుంది.సిద్దం మనోహార్ సినిమా సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు. మరియు మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్,పాటలు చాలా బాగా వచ్చాయి. మంచి కథతో రేపు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

నటుడు శ్రీకాంత్ అయ్యాంగార్ మాట్లాడుతూ..ప్రేక్షకుల మెప్పు పొందేలా దర్శక, నిర్మాతలు ఈ సినిమాను చాలా బాగా తీశారు. యూత్ కు ఉపయోగ పడే మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు మధునందన్ మాట్లాడుతూ.. శ్రీ రాం ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న మొదటి చిత్రమిది. మంచి కథను నమ్ముకొని తీస్తున్న నిర్మాతకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

చిత్ర హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మాన్యూయెల్ మాట్లాడుతూ.. సీనియర్ నటులతో ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నటీ నటులు:
ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, సీనియర్ హీరో సుమన్, మధునందన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, సనా, కళ్యాణ్ తదితరులు

సాంకేతక వర్గం:
సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్:
ఉడగండ్ల సాగర్, ఆర్ట్: దొలూరి నారాయణ, పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా, నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

22 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago