మా ‘అన్వేషి’ సినిమాను బ్లాక్ బస్టర్‌గా ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు

Must Read

విజయ్‌ ధరణ్, సిమ్రాన్‌ గుప్తా, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించిన హారర్‌ అండ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వంలో టి.గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌వంబ‌ర్ 17న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

అశోక్ కుమార్ మాట్లాడుతూ ‘‘అన్వేషి’ చిత్రాన్ని మేం ఊహించిన విధంగా పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మా డైరెక్ట‌ర్ వి.జె.ఖ‌న్నాగారు ఇన్ని రోజులు ప‌డ్డ క‌ష్టానికి మంచి విజ‌యం ద‌క్కింది. అలాగే నిర్మాత‌గారు కూడా స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. హీరో విజ‌య్‌కి, హీరోయిన్ సిమ్రాన్ గుప్తాకి మంచి పేరు వ‌చ్చింది. నాగిగారి కామెడీని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తున్నారు. మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో ‘అన్వేషి’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కో ప్రొడ్యూస‌ర్ కిర‌ణ్ మాట్లాడుతూ ‘‘‘అన్వేషి’ సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈవారం దాదాపు అన్ని థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమాలే రిలీజ్ అయ్యాయి. అయితే మా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్స్ సంఖ్య‌ను కూడా పెంచే ఆలోచ‌న‌లో ఉన్నాం’’ అన్నారు.

దుర్గేష్ మాట్లాడుతూ ‘‘మాకు ఇంత పెద్ద స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. ఇదే స‌క్సెస్‌ను కొన‌సాగించాల‌ని అనుకుంటున్నాం. ఎంటైర్ యూనిట్ చాలా ఎంజాయ్ చేస్తోంది’’ అన్నారు.

యాక్ట‌ర్ నాగి మాట్లాడుతూ ‘‘మా ‘అన్వేషి’ సినిమా విజయంలో భాగమైన అందరికీ థాంక్స్. మా డైరెక్టర్ వి.జె.ఖన్నా సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. మా హీరో విజ‌య్ లేక‌పోతే ఈ సినిమా లేదు. అలాగే మా గ‌ణ‌ప‌తి రెడ్డిగారు ఖ‌ర్చు విష‌యంలో వెనుకాడ‌కుండా సినిమాను రూపొందించారు. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ గుప్తా మాట్లాడుతూ ‘‘మా ‘అన్వేషి’ సినిమా సూపర్ హిట్టయ్యింది. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఏడుపొస్తుంది. ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. నా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. వారి స‌పోర్ట్‌తోనే ఈ సినిమాను ఇంత బాగా తెర‌కెక్కించాం. మా ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ జ‌ర్నీలో వ‌చ్చిన ఇబ్బందుల‌న్నింటిని అధిగ‌మించి సినిమాను స‌క్సెస్ చేయ‌టంలో కీల‌క పాత్ర పోషించారు. ఈ స‌క్సెస్‌లో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వి.జె.ఖ‌న్నా మాట్లాడుతూ ‘‘మేం చిన్నగా చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆశీర్వ‌దించారు. అన్ని చోట్ల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అంద‌రూ ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఈ జ‌ర్నీలో మేం ప‌డ్డ క‌ష్టం ఈ స‌క్సెస్‌తో మ‌ర‌చిపోయాం. మా నిర్మాత గ‌ణ‌ప‌తి రెడ్డిగారి వ‌ల్లే సినిమాను ఇంత గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌గ‌లిగాం. ఆయ‌న పాజిటివ్ మ‌న‌సుతోనే అది సాధ్య‌మైంది. మా కో ప్రొడ్యూస‌ర్స్‌కి థాంక్స్‌. యు.ఎఫ్‌.ఓ ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. మూవీ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించిన సైమ‌న్స్‌గారి వ‌ర్క్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ భ‌ర‌ద్వాజ్ అందించిన పాట‌ల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లి తెర‌కే ప‌రిమిత‌మైన నాగిని అన్వేషి నాగి అంటున్నారు. త‌న‌ని సునీల్‌తో పోలుస్తున్నారు. సిమ్రాన్ గుప్తా న‌ట‌న‌ను అప్రిషియేట్ చేస్తున్నారు. అనన్య నాగ‌ళ్ల పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారు, అభినందిస్తున్నారు. అలాగే హీరో విజ‌య్ ధ‌ర‌ణ్‌ను మంచి హీరో వ‌చ్చాడ‌ని అనుకుంటున్నారు. ఈ స‌క్సెస్‌లో పార్ట్ అయిన ఎంటైర్ టీమ్‌కి థాంక్స్‌. ’’ అన్నారు.

నిర్మాత టి.గ‌ణ‌ప‌తి రెడ్డి మాట్లాడుతూ ‘‘మా అన్వేషి సినిమాను బ్లాక్ బస్టర్ మూవీగా ఆద‌రించిన ప్రేక్ష‌కుల‌కు శిర‌స్సు వంచి పాదాభివంద‌నం తెలియ‌జేసుకుంటున్నాను. రెండు వారాలుగా నిద్రహారాలు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాం. ఈరోజు ఈ స‌క్సెస్‌తో మా క‌ష్టం మ‌ర‌చిపోయాం. మా హీరోయిన్ సిమ్రాన్ గుప్తా అయితే ఏ ప్రోగ్రామ్ కండెక్ట్ చేసిన అందులో ఆమె ముందుగా పార్టిసిపేట్ చేస్తూ వ‌చ్చారు. సినిమాపై ఆమెకు ఉన్న ప్యాష‌న్ చూస్తే ముచ్చ‌టేస్తుంది. ఈ సినిమా వ‌ల్ల మేం ఎంత వ‌ర‌కు రీచ్ కావ‌చ్చునో అంత వ‌ర‌కు రీచ్ అయ్యాం. చిన్న బ్యాన‌ర్స్‌, సినిమాలంటూ చిన్న చూపు చూడ‌కండి. మా సినిమా రిలీజ్‌కు స‌పోర్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. మంచి థియేట‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌ను ఆయ‌న ఇచ్చారు. ఆయ‌న చేసిన సాయానికి థాంక్స్‌. నాగిగారికి, అజ‌య్ ఘోష్‌, అన‌న్య నాగ‌ళ్ల స‌హా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. డైరెక్ట‌ర్ వి.జె.ఖ‌న్నాకు మంచి ఫ్యూచ‌ర్ ఉంది. హీరో విజ‌య్, త‌న‌కు ఎవరూ లేర‌ని ఫీల్ అయ్యారు. అయితే ఇక‌పై త‌న‌కు మంచి టీమ్ ఏర్ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో హీరోగా త‌ను మంచి స‌క్సెస్ సాధిస్తార‌ని న‌మ్ముతున్నాను. మా దుర్గేష్ మంచి పాత్ర‌ను పోషించారు. అలాగే మా ఎంటైర్ టీమ్ శ్ర‌మ ఎంతో ఉండ‌బ‌ట్టే ఇక్క‌డ వ‌ర‌కు రాగ‌లిగాం. మా బ్యాన‌ర్‌కు ఇలాగే స‌పోర్ట్‌ను కొనసాగించాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.

హీరో విజ‌య్ ధ‌ర‌ణ్ మాట్లాడుతూ ‘‘అన్వేషి రిలీజ్ వరకు తెలియని టెన్షన్ ఉండింది. స‌రిగ్గా కూడా నిద్ర పోలేదు. సినిమా రిలీజైంది.. వ‌చ్చిన రెస్పాన్స్ చూసి నిన్న రాత్రి ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాను. సినిమా గురించి అప్రిషియేట్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు. మెసేజ్‌లు పంపుతున్నారు. నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకోరా అని అన్న‌వాళ్లే న‌న్ను అభినందిస్తూ మెసేజ్‌లు పెట్టారు. మా కో యాక్ట‌ర్స్‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు అంద‌రి స‌పోర్ట్‌తో ఈ స‌క్సెస్ సాధ్య‌మైంది. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ భ‌రద్వాజ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన సైమ‌న్స్‌గారు, ఎడిట‌ర్ కార్తీక శ్రీనివాస్‌, సినిమాటోగ్రాఫ‌ర్ కె.కె, ఆర్ట్ డైరెక్ట‌ర్ గాంధీ .. అంద‌రూ చ‌క్క‌గా స‌పోర్ట్ అందించారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ దుర్గేష్‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. మా డైరెక్ష‌న్ టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. ఈ జ‌ర్నీలో నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. మా కో ప్రొడ్యూస‌ర్స్ వ‌ల్ల చిన్న‌గా ప్రారంభ‌మైన అన్వేషి సినిమా, గ‌ణ‌ప‌తిరెడ్డిగారి వ‌ల్ల రేంజ్ మారిపోయింది. ఆయ‌న ఈ సినిమాలో భాగం కావ‌టం మా అదృష్టం. నా కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డే ఈ స్టెప్‌ను వేసే క్ర‌మంలో గ‌ణ‌ప‌తి రెడ్డిగారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను. మా డిస్ట్రిబ్యూర్స్‌కు థాంక్స్‌. ఆడియెన్స్ సినిమా చూసి మౌత్ టాక్‌తో స్ప్రెడ్ చేశారు. క‌లెక్ష‌న్స్ పెరిగాయి. మా సినిమాను ఎంక‌రేజ్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

Latest News

Audience will connect with the character of Baghi that I play in Drinker Sai Aishwarya Sharma

The film Drinker Sai stars Dharma and Aishwarya Sharma in the lead roles, with the tagline Brand of Bad...

More News