హిడింబ’ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: థాంక్స్ మీట్ లో హిడింబ టీమ్

Must Read

 

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘థాంక్ యూ మీట్’ని నిర్వహించింది.

హీరో అశ్విన్ బాబు .. ‘హిడింబ’ ని పెద్ద విజయం వైపు తీసుకువెళుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో .. ఇది సాధ్యపాడుతుందా  అని నేను, అనిల్ అనుకున్నాం. కానీ కొత్తదనం వుంటే మేము ఉన్నామని సినీ ప్రేక్షకులందరూ మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా వుంది. ‘హిడింబ’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి. బిజినెస్ అయ్యింది. డిస్ట్రిబ్యూట ర్స్ చాలా హ్యాపీగా  వున్నారు. ఈ వర్షంలో కూడా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి సూపర్ హిట్ అని చెప్పడం ఆనందంగా వుంది. అనిల్ సుంకర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మకరంద్ దేశ్ పాండే గారు మా సినిమాలో వుండటం అనందంగా వుంది. నందిత శ్వేత, రఘు అన్న ఎంతగానో సపోర్ట్ చేశారు. మా నిర్మాత శ్రీధర్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. వికాస్ బడిసా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి మంచి పేరు రావడం ఆనందంగా వుంది. కళ్యాణ్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. నేను ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫస్ట్ సీన్ ని ఎవరూ మిస్ అవ్వద్దు. అందులో స్క్రీన్ ప్లే థ్రిల్ వుంటుంది. అది మిస్ ఐతే మళ్ళీ సినిమాలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ సినిమాని బ్లెస్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ తెలిపారు.  

మకరంద్ దేశ్ పాండే మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా సర్ ప్రైజ్ అయ్యాను. గొప్ప విజన్ తో ఈ సినిమాతో తీశారు.  ఇలాంటి కాన్సెప్ట్ తో నటీనటులని, ప్రేక్షకులని మెప్పించడం అంత తేలిక కాదు. దయచేసిన ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరు మరో పదిమందితో చెబుతారు.  హిడింబ నా కెరీర్ లో అరుదైన సినిమాగా నిలిచిపోతుంది. అశ్విన్ బాబు గొప్ప ఎనర్జీతో చేశారు. అలాగే శ్వేతా తో పాటు మిగతా అందరూ చక్కగా నటించారు. టీం అందరికీ థాంక్స్. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు.

హీరోయిన్ నందిత శ్వేతా మాట్లాడుతూ.. హిడింబ అందరికీ గొప్పగా రీచ్ అయ్యింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. నిర్మాత శ్రీధర్ గారికి కృతజ్ఞతలు. వికాస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా నాకు ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత మళ్ళీ అంత మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. దర్శకుడు అనిల్ గారు నాకు చాలా పవర్ ఫుల్ రోల్ ఇచ్చారు. మకరంద్ దేశ్ పాండే గారితో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అశ్విన్ తో వర్క్ చేయడం చాలా ఇష్టం. తను అద్భుతమైన నటుడు. తనతో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. టీం అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.

దర్శకుడు అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐతే ఈ వర్షాలని తట్టుకొని మొన్న సెకెండ్ షో నుంచి మెల్లగా గ్రోత్ మొదలైయింది. రెండు రోజులకి మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాదాపు 70 శాతం బ్రేక్ ఈవెన్ లో వున్నారు. వర్షాలు లేకపోతే ఈ రోజు, రేపు బ్రేక్ ఈవెన్ స్టేజ్ కి వచ్చి అందరూ లాభపడాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు బ్లడీ స్కేరీ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టాం .ఈ చిత్రంలో రక్తాన్ని భయం లేకుండా చూపించి స్కేరీ ని స్టయిలీస్ గా ప్రజంట్ చేశాం. మకరంద్ దేశ్ పాండే గారు అద్భుతంగా చేశారు. వికాస్ బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. మా డీవోపీ రాజశేఖర్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. కళ్యాణ్ చక్రవర్తి మంచి డైలాగ్స్ రాశారు. నిర్మాత శ్రీధర్ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా వుంది. దీనికి మా హీరో అశ్విన్ కాంట్రిబ్యుషన్ ఎంతో వుంది. అన్ని విధాలుగా ప్రోత్సహించారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు.  తనతో మరిన్ని సినిమాలు చేయాలి. శ్వేతా చాలా చక్కగా నటించింది. అనిల్ సుంకర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” తెలిపారు

నిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ.. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంత వర్షంలో కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో భాగమైన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. ఇంత బిజీలో కూడా మా కోసం ముంబాయ్ నుంచి వచ్చిన మకరంద్ దేశ్ పాండే గారికి స్పెషల్ థాంక్స్. ఆయన దేశంలోని అత్యున్నత నటుల్లో ఒకరు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమాని ఇంకా చూడని వారు వెళ్లి థియేటర్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News