‘ప్రణయ గోదారి’ చిత్రానికి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, సక్సెస్ మీట్‌లో విఘ్నేశ్

సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ప్రణయ గోదారి’ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ అయింది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు, మీడియాకు థాంక్స్ చెప్పేందుకు ప్రణయగోదారి టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రమైనా పెద్ద హిట్ అందించిన ఆడియెన్స్, మీడియాకి థాంక్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ టీంను అభినందించారు. విజువల్స్, పాటలు ఇలా ప్రతీ దాని గురించి మాట్లాడారు. కొత్త టీం అయినా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. ఆడియెన్స్ ఫీడ్ బ్యాక్ విని మాకు చాలా ఆనందమేసింది. ప్రేక్షకులు బాగానే ఉందని అన్నారు.. కానీ మీడియా వారు ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం. మీడియా కూడా మా మూవీని మెచ్చుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సదన్ గారు సెట్‌లో మా అందరినీ నవ్విస్తూ ఉంటారు. సాయి కుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’అని అన్నారు

సంగీత దర్శకుడు మార్కండేయ మాట్లాడుతూ.. ‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నారు. మా సినిమా జనాల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ముఖ్య పాత్రను పోషించింది. నేను ఇచ్చిన పాటలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నటుడు సునీల్ రావినూతల మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా రోజుల తరువాత అందమైన ప్రేమ కథా చిత్రాన్ని చూశామని అంటున్నారు. కథకు తగ్గ విజువల్స్, పాటలు ఉన్నాయని అన్నారు. మార్కండేయ గారి పాటల్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మా చిత్రానికి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

నటి ఉషా శ్రీ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి చిత్రాన్ని ఆడియెన్స్ ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా ఇంకా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కెమెరామెన్ ప్రసాద్ ఈదర మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి చిత్రానికి కెమెరామెన్‌గా పని చేసినందుకు ఆనందంగా ఉంది. మా చిత్రానికి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన వారందరికీ థాంక్స్’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ కళాధర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి చిత్రంలో పాటల పిక్చరైజేషన్ బాగుందని అంతా చెబుతున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తోంది. కెమెరామెన్‌ గారు అందంగా తీశారు. నటీనటులు అందంగా నటించారు. మీడియా వల్లే మా సినిమాకు ఇంత ఆదరణ లభిస్తోంది’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago