‘కృష్ణ వ్రింద విహారి’ని బ్లాక్ బస్టర్ చేసినందుకు కృతజ్ఞతలు

Must Read

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’.  షిర్లీ సెటియా కథానాయిక.  శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ  నేపధ్యంలో  చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. మా సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంచి సినిమా. థియేటర్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు నుండి థియేటర్లు , రెవెన్యూ  పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా వున్నాం.

మాకు ఎంతగానో సహకరించిన మీడియా మిత్రులకు, వంశీ-శేఖర్ కృతజ్ఞతలు. సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ ఇలా అందరూ నటులు చాలా అద్భుతంగా చేశారు. వారితో కలసి చేసిన సీన్స్ కి థియేటర్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ఇచ్చిన దర్శకుడు అనీష్ కృష్ణకు, నిర్మాతైన మా అమ్మకి థాంక్స్. ఛలో తర్వాత గర్వపడే హిట్ ఇచ్చినందు మా అమ్మకి స్పెషల్ థాంక్స్. సినిమాని ఇంకా చూడనివారు థియేటర్ కి రండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి కృతజ్ఞతలు. ఈ సినిమాపై మొదటి నుండి చాలా నమ్మకంతో వున్నాం.

ఆ బలమైన నమ్మకంతోనే నాగశౌర్య పాదయాత్ర కూడా చేశారు. ఈ పాదయాత్రకి ఎంతగానో సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బందికి, పీఆర్ టీంకి, పాదయాత్రలో మా వెంటనడిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ‘కృష్ణ వ్రింద విహారి’ ఫ్యామిలీతో అందరూ కలసి థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఒక రెండు గంటల పాటు అన్ని ఒత్తిళ్ళు పోగొట్టి మనసుని హాయితో నింపే సినిమా ఇది. థియేటర్ కి వచ్చిన అందరూ చాలా ఎంజాయ్ చేశారు.

దసరా సెలవలు కూడా వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు మీ ప్యామిలీతో కలిసొచ్చి సినిమా చూసి ఆనందించాలి” అని కోరారుదర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ మాట్లాడుతూ..  ‘కృష్ణ వ్రింద విహారి’ డీసెంట్ ఓపెనింగ్స్ తో మొదలైయింది. శుక్రవారం కంటే శనివారం 36 శాతం రెవెన్యు పెరిగింది. ఆదివారం ఇంకో 20 శాతం పెరిగింది. రెవెన్యూ స్టడీగా కొనసాగుతోంది. సినిమాని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగశౌర్య గారికి స్పెషల్ థాంక్స్. రాధిక గారితో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.ఈ వేడుకలో రాహుల్ రామకృష్ణ, సత్య, హిమజ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News