ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు “తల్లి మనసు”

Must Read

ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో “తల్లి మనసు” చిత్రాన్ని మలిచారు.

రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మిస్తున్న చిత్రమిది.

నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం గురించి నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ, “ఆ మధ్య షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ తో పాటు రీ రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే తొలికాపీ సిద్దమవుతుంది. అటుపిమ్మట సెన్సార్ పూర్తి చేయించి, ఈ నవంబర్ నెలలోనే విడుదల చేస్తాం. డబ్బింగ్, రీ రికార్డింగ్ దశలో ఈ చిత్రానికి పనిచేయని కొందరు ఈ చిత్రాన్ని చూసి, ఓ మంచి చిత్రాన్ని తీశారని చప్పట్లు కొట్టి, ప్రశంసించడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు కోటి సైతం చాలా మంచి చిత్రాన్ని తీశారని అభినందించారు ” అని చెప్పారు.

చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, “మంచి కథ, కథనాలు ఒక ప్లస్ పాయింట్ అయితే, వాటిని తెరపైన తీర్చిదిద్దిన విధానం మరొక ప్లస్ పాయింట్. మొత్తం మీద మాకు చాలా సంతృప్తినిచ్చిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరింపచేస్తుందన్న నమ్మకం ఉంది” అని అన్నారు

దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, ఓ మధ్య తరగతి తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా తెరకెక్కించామని చెప్పారు. నిర్మాత అభిరుచి కూడా చిత్రం చాలా బాగా రావడానికి దోహదం చేసిందని చెప్పారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ) .

Latest News

Splash Colors Media & Settle King Production No1 Shoot commences

Splash Colors Media, Alinea Avighna Studios & Settle King Production No: 1 is being produced by Venubabu, Directed by...

More News