ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కింగ్ నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో నాగార్జునను కలిసి అసోసియేషన్ సినీ పాత్రికేయులకు, వారి కుటుంబాలకు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు.
ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని నాగార్జున గారికి వివరించారు.
సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్ జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా నాగార్జున ప్రశంసించారు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని కింగ్ నాగార్జున అన్నారు.
నాగార్జున గారిని కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, వైస్ ప్రెసిడెంట్ వంశీ , ప్రేమ, జాయింట్ సెక్రటరి జీ.వి మరియు కమిటీ మెంబర్స్ ఉన్నారు.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…