బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో కింగ్ నాగార్జునను కలిసిన TFJA కమిటీ

Must Read

ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కింగ్ నాగార్జున గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

బిగ్ బాస్ రియాల్టీ షో సెట్ లో నాగార్జునను కలిసి అసోసియేషన్ సినీ పాత్రికేయులకు, వారి కుటుంబాలకు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీతో పాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు.

ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని నాగార్జున గారికి వివరించారు.

సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్ జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా నాగార్జున ప్రశంసించారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి అక్కినేని ఫ్యామిలీ నుంచి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని కింగ్ నాగార్జున అన్నారు.

నాగార్జున గారిని కలిసిన వారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, వైస్ ప్రెసిడెంట్ వంశీ , ప్రేమ, జాయింట్ సెక్రటరి జీ.వి మరియు కమిటీ మెంబర్స్ ఉన్నారు.

Latest News

“కిల్లర్” మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు, దగ్గరగా ఆన్సర్ చెప్పిన 10 మందికి లక్ష రూపాయల చొప్పున బహుమతి ఇస్తున్నాం – యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్..!

ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" మూవీ. ఈ సినిమాకు చేసిన కోటి రూపాయల కాంటెస్ట్ ప్రమోషన్...

More News