ఘనంగా “మల్లె మొగ్గ” సినిమా సక్సెస్ మీట్, “తథాస్తు” మూవీ పోస్టర్ లాంఛ్

Must Read

కన్నా నాగరాజు సమర్పణలో హెచ్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మల్లె మొగ్గ’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించడంతో పాటు రామ్ తేజ్ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తున్న కొత్త సినిమా “తథాస్తు” పోస్టర్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ చంద్రమహేశ్ మాట్లాడుతూ – ‘మల్లె మొగ్గ’ విజయంవంతం కావడం సంతోషంగా ఉంది. దర్శకుడు తోట వెంకట నాగు తన జీవితంలో చూసిన ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. హీరో రామ్ తేజ్ ఎనర్జిటిక్ గా నటించాడు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు తప్పకుండా ఆదరణ పొందుతాయి. ‘మల్లె మొగ్గ’ సినిమా ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా టీమ్ కు నా కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ – ‘మల్లె మొగ్గ’ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతోందని మూవీ టీమ్ చెబుతుండటం హ్యాపీగా ఉంది. ఏటా విడుదలయ్యే సినిమాల్లో 5 శాతం సక్సెస్ అవుతున్నాయి. ఈ సంవత్సరం 230కి పైగా సినిమాలు రిలీజైతే ఆదరణ పొందినవి కేవలం 10 మాత్రమే. చిన్న సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. కంటెంట్ ఉండటం వల్లే ‘మల్లె మొగ్గ’ సినిమా సక్సెస్ అందుకుంది. భానుచందర్ తో నాకు పాతికేళ్ల పరిచయం ఉంది. హీరో రామ్ తేజ్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సంస్థ మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత బాలాజీ నాగలింగం మాట్లాడుతూ – దామోదర ప్రసాద్ తండ్రి గారు సినిమాలు చేసేప్పుడు వారి సంస్థలో పనిచేశాను. సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ తో ఎన్నో ఏళ్లుగా పరిశ్రమలోనే ఉన్నాం. నిర్మాతగా ఇకపైనా చిత్ర పరిశ్రమలో కొనసాగాలని ఆశిస్తున్నాను. అన్నారు.

సహ నిర్మాత కన్నా నాగరాజు మాట్లాడుతూ – తోట వెంకట నాగేశ్వరరావు చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఈ ప్రాజెక్ట్ లోకి సహ నిర్మాతగా జాయిన్ అయ్యాను. బీ, సీ సెంటర్స్ లో మా ‘మల్లె మొగ్గ’ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. మా దగ్గరలోని థియేటర్స్ లో మహిళా ప్రేక్షకులకు చీరలు పంచిపెట్టాం. ప్రతి మహిళ చూడాల్సిన సినిమా ఇది. ‘మల్లె మొగ్గ’ సినిమా మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు కోట శంకర్రావు మాట్లాడుతూ – మల్లె మొగ్గ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. చిన్న సినిమా బాగుండాలి. అప్పుడే మాలాంటి ఆర్టిస్టులకు అవకాశాలు వస్తాయి. పెద్ద సినిమా రెండేళ్ల టైమ్ పడుతుంది. కానీ చిన్న సినిమా కొన్ని నెలల్లోనే రిలీజ్ కు వస్తుంది. అలాంటప్పుడు అందరికీ పని దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందితే ఇండస్ట్రీ బాగుంటుంది. అన్నారు.

నటుడు భానుచందర్ మాట్లాడుతూ – ‘మల్లె మొగ్గ’ సినిమాలో మంచి క్యారెక్టర్ లో కనిపిస్తాను. మంచి స్టోరీతో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కడం సంతోషంగా ఉంది. ఈ కథలో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉన్నాయి. మా డైరెక్టర్ నాగేశ్వరరావుకు నాగు అని పేరు పెట్టుకోమని నేనే చెప్పాను. సకుటుంబంగా ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమిది. ఈ సినిమాతో పాటు రామ్ తేజ్ చేస్తున్న తథాస్తు సినిమా కూడా మంచి సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో రామ్ తేజ్ మాట్లాడుతూ – నన్ను హీరోగా చేసిన మా మామయ్య, మా డైరెక్టర్ తోట వెంకట నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు. మా మామయ్యకు నేను ఇలా వేదిక మీద చెప్పడం తొలిసారి. కానీ ఆయన నా మనసులో ఉంటారు. ఆయన పేరు, మా తాతయ్య పేరు నిలబెడతా. మల్లె మొగ్గ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ. మేము ఇకపై సిటీ నేపథ్యమున్న చిత్రాలు కూడా తీయాలనుకుంటున్నాం. అన్ని జానర్స్ మూవీస్ తో మీ ముందుకు వస్తాం. మల్లె మొగ్గ సినిమాలాగే మా నెక్ట్ మూవీస్ కు కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత తోట వెంకట నాగేశ్వరారవు మాట్లాడుతూ – ‘మల్లె మొగ్గ’ సినిమాకు బీ, సీ సెంటర్స్ ఆదరణ బాగుంది. సిటీలో థియేటర్స్ తక్కువగా దొరికాయి. రిలీజైన ప్రతి చోటా మూవీ బాగుందనే రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తోంది. ఇది ఎమోషన్, సెంటిమెంట్, లవ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. మేము ఇప్పుడు చేయబోయే తథాస్తు మూవీ కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News