‘తగ్గేదే లే’ చిత్రం నుంచి ‘తగ్గేదే లే’ గీతం రిలీజ్‌

Must Read

భద్ర ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ నుంచి రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘తగ్గేదే లే’. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ఇంట్రెస్టింగ్ టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘తగ్గేదే లే’ అనే స్పెషల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను మ‌రో యంగ్ హీరో రాజ్ త‌రుణ్ విడుద‌ల చేసి ఎంటైర్ టీమ్‌కు అభినంద‌నలు తెలిపారు.ఈ మాసివ్ జాన‌ప‌ద పాట‌లో మాస్ బీట్‌కి నైనా గంగూళీ ఆక‌ట్టుకునే డాన్స్ చూసిన ప్ర‌తి ఒక్క‌రినీ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళుతుంది. ప్రోమోలో అద్భుత‌మైన డాన్స్ మూమెంట్స్ క‌నిపిస్తుండ‌గా, లిరికల్ వీడియోలో ఇంకా ఏదో కొత్త ఉంటుంద‌నే ఓ అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాట విన్న‌వారందిర‌కీ న‌చ్చుతుంది.

మాసివ్ బీట్‌కి నైనా గంగూళీ వేసిన డాన్స్ అంద‌రిని మెప్పిస్తుంది. దీంతో పాట చూసిన వెంట‌నే అంద‌రికీ క‌నెక్ట్ అయిపోతుంది. సంగీతం అందించ‌టంతో పాటు చ‌ర‌ణ్ అర్జున్ పాటను రాశారు కూడా. రానున్న రోజుల్లో త‌గ్గేదే లే సాంగ్‌ను అంద‌రినీ క‌ట్టిప‌డేస్తుంద‌నేంత‌గా ఉంది. మోహ‌న భోగ‌రాజు, చ‌ర‌ణ్ అర్జున్‌, శ‌ర‌త్ ర‌వి  మాసివ్ సాంగ్‌ను పాడారు.దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే, మ‌క‌రంద్ దేశ్ పాండే, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, పూజా గాంధీ, రాజా ర‌వీంద్ర‌, ర‌వి శంక‌ర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌ట్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తుండ‌గా గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ చేస్తున్నారు.త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

న‌వీన్ చంద్ర‌, దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా, నైనా గంగూలీ, ర‌వి శంక‌ర్‌, రాజా ర‌వీంద్ర‌, నాగ‌బాబు, అయ్య‌ప్ప శ‌ర్మ‌, పూజా గాంధీ, మ‌క‌రంద్ దేశ్ పాండే, ర‌వి కాలే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  శ్రీనివాస్ రాజు
బ్యాన‌ర్:  భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు:  ప్రేమ్ కుమార్ పాండే, ఎన్‌. అఖిలేష్ రెడ్డి,  పి.వి.సుబ్బా రెడ్డి
సినిమాటోగ్రఫీ:  వెంక‌ట్ ప్ర‌సాద్‌
సంగీతం:  చ‌ర‌ణ్ అర్జున్‌
బీజీఎం:  చిన్నా
ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:   కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్ :  వెంక‌ట్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్‌, భాను
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  రాజా ర‌వీందర్‌

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News