‘స్వీటీ నాటీ క్రేజీ’ లాంచ‌నంగా ప్రారంభం

Must Read

త్రిగుణ్, శ్రీజిత ఘోష్ కాంబోలో అరుణ్ విజువల్స్ బ్యానర్ మీద ఆర్. అరుణ్ నిర్మించిన చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. ఈ మూవీకి రాజశేఖర్.జి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

త్రిగుణ్, శ్రీజిత ఘెష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి మరియ ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నేడు ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేయగా.. బెక్కెం వేణు గోపాల్ గారు దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో..

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ‘అరుణ్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ విజువల్స్ మీద రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీజిత, ఇనియలు ఇందులో మంచి పాత్రలుంటాయి. టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణానికి మీడియా వారు సపోర్ట్ అందించారు’ అని అన్నారు.

న‌టుడు రఘుబాబు మాట్లాడుతూ.. ‘త్రిగుణ్ ద్విభాష చిత్రంగా ఈ మూవీని చేస్తున్నారు. తెలుగులో నేను నటిస్తున్నాను. తమిళంలో నా పాత్రను రవి మరియ గారు చేస్తున్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.

న‌టుడు రవి మరియ మాట్లాడుతూ.. ‘తమిళంలో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. దర్శకత్వం వహించాను. ఖుషీ, నాని చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో నేను ఓ మంచి పాత్రను పోషిస్తున్నాను.’ అని అన్నారు.

హీరోయిన్ ఇనియ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమా అయ్యేలోపు నేర్చుకుంటాను. ఇది నాకు 45వ సినిమా. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టాను. ఇందులో నేను నందిని అనే మంచి పాత్రను చేస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.

హీరోయిన్ రాధ మాట్లాడుతూ..‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇనియతో నేను తమిళంలో చేశాను. త్రిగుణ్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఇది నాకు రీ ఎంట్రీలా అనిపిస్తోంది. మా సినిమాను అందరూ ఆదరించండి’ అని అన్నారు.

హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలో నటిస్తుండటం మొదటి సారి. ఓ నటిగా అన్ని రకాల పాత్రలను, సినిమాలను చేయాలని ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. ఇది చాలా మంచి చిత్రం అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సినిమాటోగ్రఫర్ విజయశ్రీ మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న టెన్షన్ జీవితాలకు పూర్తిగా నవ్వించే చిత్రం అవుతుంది. అందరూ హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

నిర్మాత అరుణ్ మాట్లాడుతూ.. ‘మా సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో సినిమా ఉంటుంది’ అని అన్నారు.

నటీనటులు : త్రిగుణ్, శ్రీజిత ఘెష్, ఇనియ, రాధ, అలీ, రఘుబాబు, రవి మరియ తదితరలు

సాంకేతిక బృందం:
బ్యానర్: అరుణ్ విజువల్స్, నిర్మాత: ఆర్. అరుణ్, దర్శకుడు : రాజశేఖర్. జి, సినిమాటోగ్రఫీ :సి. విజయశ్రీ, ఆర్ట్ : జయకుమార్, ప్రొడక్షన్ డిజైనర్ : ప్రహ్లాదన్, ప్రొడక్షన్ మేనేజర్ : రవి వర్మ, ప్రొజెక్ట్ సూపర్ వైజర్:మోహన్ రాజ్, అకౌంట్స్ చీఫ్ : బల్వీర్, పి.ఆర్‌.ఒ : చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News