ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎస్ వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి

Must Read

చిత్ర పరిశ్రమలో ఆదర్శ మిత్రులు ,అగ్రశ్రేణి దర్శక నిర్మాతలుగా పేరు పొందిన ఎస్వీ కృష్ణారెడ్డి- అచ్చిరెడ్డి ద్వయానికి రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోయినప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులందరితో అనుబంధం ఉన్నప్పటికీ వారు ఎప్పుడూ రాజకీయ వేదికలపై కనిపించలేదు.


అయితే ఇటీవల వారిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాము రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాన్ని గురించి అడగగా “అది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే. రేవంత్ రెడ్డి గారు మాకు చిరకాల పరిచయస్తులు. అలాగే వారి అల్లుడు గారి తరఫున దూరపు బంధుత్వం కూడా ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత శుభాకాంక్షలు తెలపడం కోసం టైం తీసుకుని గత ఆదివారం రోజున ఆయన్ను కలిశాం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని కేటాయించి మాతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన దక్షత అభినందనీయంగా ఉంది. అదే విషయాన్ని వారి వద్ద ప్రస్తావించి శుభాకాంక్షలు చెప్పాము..” అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News