సోషల్ మీడియాలో ఫన్‌మోజీకి ఉండే ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. యూట్యూబ్‌లో ఫన్‌మోజీ నుంచి వచ్చే కంటెంట్ అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ కొత్త చిత్రానికి సంబంధించి సినిమా కాన్సెప్ట్ తెలియజేసేలా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే, అందులో ఇచ్చిన హింట్లను నిశితంగా గమనిస్తే సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఏదో అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
హీరో సుశాంత్ మహాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక ఈ పోస్టర్‌లో హీరో రగ్డ్ లుక్, ఏదో సుడిగుండంలో చిక్కుకున్నట్టుగా.. అందులో కొన్ని హింట్లను కూడా వదిలారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరి దృష్టిని తమ వైపు లాక్కుని ఫన్ మోజీ టీం సక్సెస్ అయింది. ఈ మూవీ నుంచి మున్ముందు మరిన్ని అప్డేట్లు రానున్నాయి.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…