రుహాణి శర్మ HER రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల

చిలసౌ మూవీతో రుహాణి శర్మ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ సినిమాతో క్లాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. మాస్‌ ఆడియెన్స్‌ను మెప్పించే చిత్రాలను సైతం చేశారు. ఇప్పుడు రుహాణి శర్మ కొత్త జానర్‌ను ఎంచుకున్నారు. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు HER అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

HER ఫైనల్ కాపీ చూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను మేకర్లు ఇది వరకే ఇచ్చారు. ఈ సినిమాకి టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ లభించడమే తమ విజయానికి తొలి మెట్టు అని దర్శకనిర్మాతలు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత డి. సురేష్‌ బాబు రిలీజ్ చేశారు. అనంతరం సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే HER పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి.

ఈ చిత్రానికి విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందించగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరించారు. పవన్ బాణీలు కట్టారు.

తారాగణం: రుహాని శర్మ, వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ, రవి ప్రకాష్.

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: శ్రీధర్ స్వరాఘవ్
నిర్మాతలు: రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి
బ్యానర్: డబుల్ అప్ మీడియా
DOP: విష్ణు బేసి
ఎడిటింగ్: చాణక్య తూరుపు
సంగీతం: పవన్
PRO: సాయి సతీష్, పర్వతనేని

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago