విష్ణు మంచు కథానాయకుడి నటించిన తాజా సినిమా ‘జిన్నా’. పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ఆశీసులతో AVA ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై రూపొందుతోంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. సూర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించగా… కోన వెంకట్ స్క్రీన్ ప్లే రాశారు. ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా! దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.అయితే ఈరోజు విష్ణు మంచు మరియు సన్నీ లియోన్ కలిసి చేసిన మంచి మాస్ మసాలా పాట “జారు మిఠాయి” పాట లిరికల్ వీడియో ను విడుదల చేసారు. ఈ పాట చూస్తుంటే యువత ఉరుతలుగాల్సిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఎ.గణేష్ లిరిక్స్ రాసారు.
సింహ మరియు నిర్మల రాథోడ్ పాటను పాడారు. ఈ రొమాంటిక్ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టారు తన మాస్ స్టెప్ లతో పాటకి ప్రాణం పోశారు. ఈ చిత్రం లో పాటలు సరిగమ తెలుగు ఆడియో ద్వారా విడుదల అవుతున్నాయి.విడుదల అయినా ట్రైలర్ కి ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగాయి. విష్ణు మంచు ఈ చిత్రం పై బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉంది.
నటీ నటులు – విష్ణు మంచు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు : అవా ఎంటర్ టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకత్వం :: సూర్య
సినిమాటోగ్రఫి : ఛోటా కె. నాయుడు
కథ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్