ఏకకాలంలో అయిదు భాషల్లో
విడుదల చేసేందుకు సన్నాహాలు
“ఆదిపర్వం” ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని ఓ అమ్మవారి గుడి చుట్టూ జరిగిన యదార్థ సంఘటనల నుండి అల్లుకున్న కథ, ఆ అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ!!
ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు.
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ – ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు – కన్నడ – హిందీ – తమిళ – మలయాళ) ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ (U/A) సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. ఇటీవల ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటలు “అన్విక ఆడియో” ద్వారా విడుదలయ్యాయి. దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతుండడం చెప్పుకోదగ్గ విశేషం!!
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ…”బహు భాషల్లో రూపొందిన “ఆదిపర్వం” అద్భుతంగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ట్రైలర్ కి వస్తున్న అసాధారణ స్పందనకు తోడు సెన్సార్ సభ్యుల ప్రశంసలు ఈ చిత్రంపై మా నమ్మకాన్ని రెట్టింపు చేశాయి. త్వరలో విడుదల తేది ప్రకటిస్తాం” అన్నారు!!
నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీ జోష్, సమ్మెట గాంధీ, యోగి కత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, కైపా ప్రతాప్ రెడ్డి, చీరాల రాజేష్, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు….
సాంకేతికవర్గం:
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్, ఆర్ట్ : కేవీ రమణ, మ్యూజిక్: మాధవ్ సైబా – సంజీవ్ మేగోటి – బి.సుల్తాన్ వలి – ఓపెన్ బనానా – లుబెక్ లీ మార్విన్, సాహిత్యం: సాగర్ నారాయణ్ – రాజాపురం శ్రీనాథ్ – ఊటుకూరు రంగారావు – మనేకుర్తి మల్లికార్జున – రాజ్ కుమార్ సిరా, ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి, ఫైట్స్: నటరాజ్, కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్టర్, పబ్లిసిటీ డిజైనర్: రమణ బ్రష్, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, కో డైరెక్టర్: అక్షయ్ కుమార్ సిరిమల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి – ప్రదీప్ కాటుకూటి- రవి దశిక – రవి మొదలవలస – శ్రీరామ్ వేగరాజు, నిర్మాత: ఎమ్.ఎస్.కె. రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.
God of Masses Nandamuri Balakrishna has been on a blockbuster success streak in recent years…
కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం 'NBK109'…
https://youtu.be/UKsYG86wuRY?si=gtpYD58f16unuQmH
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ…
Rakesh Varre is playing the title role in the movie Jitender Reddy. Directed by Virinchi…
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22…