Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

ఎం.టి. వాసుదేవన్ నాయర్ 90వ బర్త్ డే సందర్భంగా ‘మనోరథంగల్’ని ప్రకటించిన ZEE5

Must Read

  • MT వాసుదేవన్ నాయర్ పుట్టినరోజు సందర్భంగా 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ ఫిల్మ్ మేకర్స్‌తో మలయాళ ఇండస్ట్రీలోని అత్యుత్తమ టెక్నీషియన్లంతా కలిసి 9 ఆసక్తికరమైన కథలతో రాబోతోన్న’మనోరథంగల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు.
  • మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్ట్ 15న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.

భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, మలయాళ చిత్రసీమలో కొత్త శకానికి నాంది పలికే సరికొత్త వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’ను ప్రారంభించారు. M.T. అని ముద్దుగా పిలుచుకునే సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ 90వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రూపొందించిన ఈ అద్భుతమైన చిత్రం ఆగస్టు 15న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ‘మనోరతంగళ్’ వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల సంకలనమే ఈ వెబ్ సిరీస్. ఈ తొమ్మిది కథలకూ ఓ కనెక్షన్ ఉంటుంది. 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్ సిరీస్ ZEE5లో రాబోతోంది.

Manorathangal Official Trailer | A ZEE5 Original | Mohan Lal, Mammootty, Fahadh | Watch Now

తొమ్మిది కథలకు ఎనిమిది మంది టాప్ డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు. వీటికి ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు దర్శకత్వం వహించారు.

ZEE5 ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ..‘ZEE5లో రానున్న ‘మనోరథంగల్’తో మాలీవుడ్ టాలెంట్ అంతా ఒకే చోటకు రానుంది. ఇది MT వాసుదేవన్ నాయర్‌కు నివాళిలా ఉంది. సాహిత్య దిగ్గజం, సినిమాటిక్ దూరదృష్టి గల అతని 90వ బర్త్ డే సందర్భంగా ఇది జీ5లో రాబోతోన్నందుకు మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ మలయాళ సినిమా అసాధారణమైన సృజనాత్మకతను అందరికీ చూపించినట్టు అవుతుంది. వీక్షకులు తమ స్థానిక భాషలో చూసేందుకు వీలుగా ‘మనోరతంగల్’ని హిందీ, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లోకి డబ్బింగ్ చేస్తున్నామ’ని అన్నారు.

దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ.. “కలలు కనడం జీవితంలో ఒక భాగమని, నేను సినిమాలు తీయాలని కలలు కన్నాను. ఎంటీ వాసుదేవన్ నాయర్‌తో సినిమా చేయడంతో నా కల నిజమైంది.ఇది నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది నా 97వ చిత్రం. నేను ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో ఒక చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నించాను. మనోరథంగళ్‌లో రెండు కథలకు డైరెక్షన్ చేశాను. ఈ కలను నిజం చేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.

ఇంద్రజిత్ మాట్లాడుతూ.. ‘ఎమ్‌టి వాసుదేవన్ నాయర్ స్క్రిప్ట్‌లో హీరోగా నటించే అవకాశం మళ్లీ వచ్చింది. ఆయన కథలో నటించడం ఇది రెండో సారి. నేను ఇందులో కదల్‌క్కట్టు అనే భాగంలో కనిపిస్తాను. ఎమ్‌టి సార్ రాసిన బంధనం అనే చిత్రంలో మా నాన్న కూడా నటించారు. ఎం.టి. గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.

బిజు మీనన్ మాట్లాడుతూ.. ‘ఎం.టి. వాసుదేవన్ నాయర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఎమ్‌టి సర్‌ గారి సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదృష్టవశాత్తూ నా కల నెరవేరింది. ఎందరో లెజెండ్స్‌ని చూసి వారితో వేదిక పంచుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.

మమ్ముట్టి మాట్లాడుతూ.. ‘ఈ సాయంత్రం మలయాళ సినిమాలకు ప్రత్యేకమైనది. ఎందుకంటే మన పరిశ్రమలో ఇలాంటి వెబ్ సిరీస్‌లు రావడం చాలా అరుదు. నాకు ఎం.టి. వాసుదేవన్ నాయర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. సమకాలీన సాహిత్యం, రచనల్లో ఎం.టి. పరిజ్ఞానం విశేషమైనది. ఆయన ఇటీవల నాకు ఇచ్చిన పుస్తకాన్ని నేను చదవలేకపోయినప్పటికీ, నా కుమార్తె ఆ పుస్తకాన్ని ఇష్టపడింది. తాజా తరం అభిరుచులకు అనుగుణంగా ఆయన రచనలు చేస్తున్నారు. మొదట్లో రంజిత్‌తో కలిసి కడుగన్నవ కథను రెండు గంటల ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందించాలని ప్లాన్ చేశాం. ఈ పార్ట్‌ను శ్రీలంకలో షూట్ చేశాం. ఆయన రచనలను చదివి పెరిగిన వారిలో వ్యామోహాన్ని రేకెత్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. మలయాళీలు ఆయన రచనల ద్వారా సాహిత్య విలువను గ్రహించారు. నేను ఆయన కథలన్నింటినీ చదవడానికి ప్రయత్నించాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ తెలిపారు.

ఆసిఫ్ అలీ మాట్లాడుతూ.. ‘ఎం.టి. వాసుదేవన్ నాయర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఈవెంట్‌కి హాజరైనందుకు సంతోషంగా, ఎంటి సార్ రాసిన పాత్రలో నటించడానికి నాకు పదమూడు సంవత్సరాలు పట్టింది’ అని అన్నారు.

నదియా మొయిదు మాట్లాడుతూ.. ‘ఎం.టి. వాసుదేవన్ నాయర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. హరిహరన్ దర్శకత్వం వహించిన ‘పంచాగ్ని’ చిత్రం తర్వాత, ‘షెర్లాక్’ చిత్రం ద్వారా MT సర్ స్క్రిప్ట్‌లో నటించే అవకాశం నాకు లభించింది’ అని అన్నారు.

ZEE5 గురించి…

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Latest News

ఇట్స్ కాంప్లికేటెడ్’ సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో  కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ...

More News