టాలీవుడ్

‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిన: ఎస్ఎస్ రాజమౌళి

బాహుబలి ఫ్రాంచైజీ హార్ట్‌ల్యాండ్‌లో ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ టీమ్‌’ను తిరిగి మన ముందుకు తీసుకువస్తున్న డిస్నీ+ హాట్‌స్టార్

గ్రాఫిక్ ఇండియా,  ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్, S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్ నుంచి ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ 17 మే, 2024 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా ప్రసారం  

హైదరాబాద్, 7 మే, 2024: బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ టీమ్, డిస్నీ+ హాట్‌స్టార్ వారి అప్ కమింగ్ యానిమేటెడ్ సిరీస్, బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్  యునివర్స్ నిహైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో గ్రాండ్ గా ఆవిష్కరించింది. ఈ యానిమేటెడ్ సిరీస్, మాహిష్మతి అద్భుత రాజ్యాన్ని, సింహాసనాన్ని పెను ముప్పు నుండి రక్షించడానికి బాహుబలి, భల్లాలదేవ చేతులు కలిపిన సామ్రాజ్యాల ఘర్షణ యొక్క లెజెండరీ ప్రయాణంలో మిమ్మల్ని తిరిగి తీసుకువెళుతుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, విజనరీ ఫిల్మ్ మేకర్ S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్ & శోబు యార్లగడ్డ దీనిని నిర్మించారు. జీవన్ J. కాంగ్ & నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మే 17, 2024న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

ఈవెంట్‌కు హాజరైన డిస్నీ+ హాట్‌స్టార్ & హెచ్‌ఎస్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ హెడ్ – కంటెంట్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. డిస్నీ+ హాట్‌స్టార్‌లో  దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌తో అద్భుతమైన కథలను మీ ముందుకు తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము యానిమేషన్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాము. దిగ్గజ చలనచిత్ర దర్శకుడు S.S. రాజమౌళితో, గ్రాఫిక్ ఇండియాతో మా దీర్ఘకాల భాగస్వామ్యం ఇందుకు ఉదాహరణ. ఇది మీరు బాహుబలి ఫ్రాంచైజీకి అభిమాని అయినా లేదా మొదటిసారి చూస్తున్నా కూడా ప్రతి ఒక్కరికీ అభిమాన సిరీస్ అవుతుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు

ఈ కార్యక్రమానికి హాజరైన బాహుబలి యూనివర్స్ క్రియేటర్, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ. “బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది. బాహుబలి కోసం క్యారెక్టర్ ఆర్క్స్, ప్రీ స్టొరీ, పోస్ట్ స్టొరీ రాసినప్పుడు బాహుబలిలో యూనివర్స్ లో ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ వుంది అనిపించింది. వెస్ట్రన్ కంట్రీస్ లో ఒక సినిమా విజయవంతమైతే ఆ బ్రాండ్ అనేక మీడియమ్స్ లో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. సినిమా విజయవంతమైతే అక్కడితో అయిపోతుంది. అయితే మేము ఈ విజయాన్ని కొనసాగించాలని వీర్ ఫిలిమ్స్, సిరిస్ ఇలా చాలా విధాలుగా ప్రయత్నించాం. అయితే ఈ ప్రయాణంలో సరైన వ్యక్తులతో జతకట్టాలని అర్ధమైయింది. ఇలాంటి సమయంలో శరత్ వచ్చారు. యానిమేషన్ లో ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. అలా వారితో అసోసియేట్ అయ్యాం. ఆయనతో చాలా కథా చర్చలు జరిగాయి. ఈ కథని ముందుకు తీసుకెళ్ళమని శరత్ కు చెప్పడం ముందు నాకు చాలా కష్టంగా అనిపించింది. నా ప్రమేయం లేకుండా బాహుబలి కథ చెప్పడమా ?! (నవ్వుతూ) అనిపించింది. బాహుబలి ప్రతి పాత్రలో సోల్ వుంటుంది. ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులుని గొప్పగా హత్తుకుంటుంది. ఈ యానిమేషన్ సిరిస్ ని శరత్ కూడా ఆ సోల్ పట్టుకొని అద్భుతంగా రూపొందించడం ఆనందంగా వుంది. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం, ఎందుకంటే భారతదేశంలో యానిమేషన్‌ను రూపొందించడంలో వారి అభిరుచి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. మేము కలసి బాహుబలి యునివర్స్ ని విస్తరించడమే కాకుండా, దాని అద్భుతమైన యానిమేషన్, ఎమోషన్స్, సంక్లిష్టమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కథను రూపొందించాము. బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రేక్షకులని అద్భుతంగా అలరించనుంది’ అన్నారు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ కో -క్రియేటర్, రచయిత, మేకర్ శరద్ దేవరాజన్ మాట్లాడుతూ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’కి జీవం పోయడం గ్రాఫిక్ ఇండియాలో మనందరికీ సంతోషకరమైన ప్రయాణం. మేము మొదట ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు, బాహుబలి ఫ్రాంచైజీ వారసత్వానికి అనుగుణంగా యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించడం – మేము ఒక గొప్ప బాధ్యతను తీసుకుంటున్నామని మాకు తెలుసు. విజనరీ దర్శకుడు S.S. రాజమౌళితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. అతని ప్రేరణ, మద్దతుతో, మాహిష్మతి వెనుక ఉన్న కథలను, రహస్యాలను వెలికితీస్తూ, సినిమా అభిమానులను బాహుబలి ప్రపంచంలోకి మరింతగా తీసుకువెళ్ళడానికి వీలు కల్పించే కథనాన్ని రూపొందించడానికి మేము నిబద్దతగా పనిచేస్తున్నాము. ఉత్కంఠభరితమైన యానిమేటెడ్ విజువల్స్, క్లిష్టమైన పాత్రలు పిల్లలనే కాకుండా పెద్దలకు అనుగుణమైన ఆకర్షణీయమైన కథనంతో, ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ భారతీయ యానిమేషన్ ల్యాండ్‌స్కేప్‌లో గొప్ప మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.

బాహుబలి వాయిస్ కు తన గాత్రాన్ని అందించిన వ్యక్తి, నటుడు శరద్ కేల్కర్ మాట్లాడుతూ, “నేను చాలా పాత్రలకు నా గాత్రాలు అందించాను కానీ బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఈ ఫ్రాంచైజీతో నా సుదీర్ఘ అనుబంధం కారణంగా నా మనసులో ప్రత్యేక స్థానం వుంది. అభిమానులని, ప్రేక్షకులను  బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకువెళుతుంది. ఈ పాత్రకు మళ్లీ జీవం పోయడం ఒక గొప్ప అనుభూతి, ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా  సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను.  ఈ మేలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ సిరిస్ చూడడానికి ఎదురుచూస్తున్నాను’ అన్నారు

 మే 17, 2024 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ తో బాహుబలి లెగసీలో కొత్త అధ్యాయానికి సాక్ష్యంగా నిలవడానికి సిద్ధంగా ఉండండి.

Tfja Team

Recent Posts

బాలయ్య బెస్ట్ విషష్ తో పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో

'పైలం పిలగా' ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా. 'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్…

5 mins ago

Pailam Pilaga set to Relese on September 20th

The highly anticipated movie Pailam Pilaga is all set to release this week on *September…

5 mins ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించలీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

చిత్రపరిశ్రమలో,ఇటి రంగంలో,బ్యాంకింగ్ రంగంలో, మారుతున్న సమాజం దుష్ట లై0గిక వేధింపులు ఎక్కువగా అవ్వుతున్నయి ,కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుచున్నారు…

16 mins ago

MAD gang with MAD MAXX Entertainment with First Look

Sithara Entertainments, the leading production house of Telugu Cinema, has delivered a huge blockbuster with…

30 mins ago

‘మ్యాడ్’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ఫస్ట్ లుక్

'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్ తో 'మ్యాడ్' గ్యాంగ్ పునరాగమనాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్…

30 mins ago

పాన్ ఇండియా ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో "సుబ్రహ్మణ్య"సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్‌జి…

2 days ago