హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మే 10న ‘ప్రతినిధి 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రతినిధి 2 మూవీ టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. గతంలో ఒక మాస్ పాటను విడుదల చేసారు, ఈ పాటలో రోహిత్ జీవితం గురించి జ్ఞానాన్ని ఇస్తున్నట్లు కనిపించారు. రెండవ పాట- జర్నలిస్ట్ గీతం, కృష్ణకాంత్ ఆలోచింపజేసే సాహిత్యం ఇవ్వగా స్వరాగ్ కీర్తన్, జయంత్ పాడిన పాట ఇన్స్టంట్ హిట్ అయ్యింది.
ప్రతినిధి 2 ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నాడు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నాని చమిడిశెట్టి కెమరా మెన్. యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…