ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ డిఫరెంట్ జోన్ లో వున్నారు. వైవిధ్యమైన థీమ్ లతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్ బెల్లంకొండ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఇది వేసవిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా, ఛత్రపతి తర్వాత అతని తదుపరి చిత్రాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్ చంద్రతో శ్రీనివాస్ బెల్లంకొండ జతకట్టనున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి యూనిక్ స్క్రిప్ట్స్ తో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తీయడంలో పేరు తెచ్చుకున్న దర్శకుడు సాగర్ చంద్ర, బెల్లంకొండ కోసం విన్నింగ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు.
#BSS10 చిత్రం మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని గొప్ప నిర్మాణ విలువలు, భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.
రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది, #BSS10 పై క్యురియాసిటీని జనరేట్ చేస్తుంది.
ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు
తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం : సాగర్ కె చంద్ర
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
పీఆర్వో: వంశీ-శేఖర్
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…