శ్రీసింహా కోడూరి ‘ఉస్తాద్’ నుంచి ‘ఆకాశం అదిరే..’ సాంగ్ లాంచ్ చేసిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్
* ఆగస్ట్ 12న ‘ఉస్తాద్’ మూవీ గ్రాండ్ రిలీజ్
‘మత్తువదలరా’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహా కోడూరి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. ఆగస్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై ‘ఉస్తాద్’ చిత్రాన్ని ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచి అందరి అటెన్షన్‌ను సంపాదించుకుంది. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్, ‘రోజు…’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆకాశం అదిరే..’ అనే వీడియో సాంగ్ రిలీజైంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ ఎనర్జిటిక్‌గా యూత్‌కు నచ్చేలా ఉంది. ఎవరైతే బైక్స్‌ను బాగా ఇష్టపడతారో వారందరికీ ఈ సాంగ్ నచ్చుతుంది. ఉస్తాద్ అనే తన బైక్‌ను ఇష్టపడే హీరో గురించి ఈ పాటలో చూపించారు. అతను బైక్ రైడ్ ఎలా నేర్చుకున్నాడు? అతని జీవితంలో ఉస్తాద్ అనే బైక్ ఎలాంటి పాత్రను పోషించిందనే విషయాలను చక్కగా ఎలివేట్ చేశారు. లక్ష్మీ ప్రియాంక రాసిన ఈ పాటను కాల భైరవ, ఆదిత్య శ్రీరామ్ పాడారు. వీరిద్దరి ఎనర్జిటిక్ వాయిస్‌కు అకీవా.బి అందించిన మ్యూజిక్ నెక్ట్స్ రేంజ్‌లో కనెక్ట్ అవుతుంది.
శ్రీసింహ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. బలగం ఫేమ్ కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్. డిఫరెంట్ మూవీస్, పరిమిత బడ్జెట్‌లతో రూపొందుతోన్న సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఉస్తాద్ నిర్మాతలు అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ, రవి శివ తేజ, సాయికిరణ్ ఏడిద కీలక పాత్రల్లో నటించారు. అకీవా. బి సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు:
శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అను హాసన్, రవీంద్ర విజయ్, వెంకటేష్ మహ. రవి శివ తేజ, సాయి కిరణ ఏడిద తదితరులు
సాంకేతిక వర్గం:
సాయి కొర్రపాటి ప్రొడక్షన్
బ్యానర్స్: వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
రచన, దర్శకత్వం: ఫణిదీప్
సినిమాటోగ్రఫీ: పవన్ కుమార్ పప్పుల
మ్యూజిక్: అకీవా.బి
ఎడిటర్: కార్తీక్ కట్స్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములె
సౌండ్ డిజైన్: అశ్విన్ రాజశేఖర్
కాస్ట్యూమ్స్: ప్రియాంక వీరబోయిన
వి.ఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్: సునీల్ రాజు చింత
లిరిక్స్: అనంత శ్రీరాం, రెహమాన్, లక్ష్మీ ప్రియాంక
లైన్ ప్రొడ్యూసర్స్: ప్రజనయ్ కొనిగరి, రాజేష్ గడ్డం
పి.ఆర్.ఒ: వంశీ కాకా