టాలీవుడ్

శ్రీనివాస్ బెల్లంకొండ,‘ఛత్రపతి’ ఫస్ట్ లుక్ విడుదల, మే 12నరిలీజ్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ప్రభాస్, రాజమౌళి ల బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ రీమేక్‌ తో హాపెనింగ్ తెలుగు హీరో శ్రీనివాస్ బెల్లంకొండను బాలీవుడ్‌ లో లాంచ్ చేస్తోంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, శ్రీనివాస్ బాలీవుడ్ లాంచ్‌ ప్యాడ్‌ కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈరోజు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్, రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఛత్రపతి’ అని పేరు పెట్టారు. సమ్మర్ స్పెషల్ గా మే 12న సినిమా థియేటర్లలోకి రానుంది.  

ఫస్ట్-లుక్ పోస్టర్‌ శ్రీనివాస్ ని షర్ట్ లేకుండా బీస్ట్ మోడ్ లో ప్రజంట్ చేసింది. కండలు తిరిగిన దేహంతో కనిపించారు శ్రీనివాస్. ఒక చేతిలో రాగి చెంబుతో నీటిలో నిలబడి, వీపుపై గాయాలతో కనిపించారు. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించారు. పోస్టర్, భీకరమైన మేఘాలు శ్రీనివాస్ పాత్ర యొక్క అగ్రెసివ్ ని సూచిస్తున్నాయి

ఈ సినిమాలో పవర్‌ ప్యాక్‌తో కూడిన పాత్రను పోషించేందుకు బెల్లంకొండ అద్భుతమైన ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. వివి వినాయక్ , శ్రీనివాస్ ని యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో ప్రెజెంట్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే డిజిటల్ వరల్డ్ వైడ్  బిగ్గెస్ట్  స్టార్‌లలో ఒకరు. శ్రీనివాస్ ఖూంఖార్ (జయ జానకి నాయక హిందీ డబ్బింగ్) రికార్డ్ 700 మిలియన్ల వ్యూస్ ని అధిగమించింది.

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా విజయవంతమైన చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన  పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మిస్తున్నారు.

ఒరిజినల్‌కి కథను అందించిన రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌ రీమేక్ వెర్షన్‌కి కూడా రచయిత. పలు తెలుగు తమిళ చిత్రాలకు పనిచేసిన నిజార్ అలీ షఫీ కెమెరా మెన్ గా, బాలీవుడ్ అప్ కమింగ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు.

అనల్ అరుసు  యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు, ఇందులో భారతదేశంలోనే అత్యంత బిజీ టెక్నీషియన్‌లలో ఒకరైన సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్‌. ఈ చిత్రానికి మయూర్ పూరి డైలాగ్స్ అందిస్తున్నారు.

తారాగణం: శ్రీనివాస్ బెల్లంకొండ, సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: వివి వినాయక్
కథ: కెవి విజయేంద్ర ప్రసాద్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గడా
నిర్మాతలు: ధవల్ జయంతిలాల్ గడా,  అక్షయ్ జయంతిలాల్ గడా
బ్యానర్లు: పెన్ స్టూడియోస్
వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్
దీవోపీ : నిజార్ అలీ షఫీ
స్టంట్ మాస్టర్: అన్ల్ అరుసు
సంగీతం: తనిష్క్ బాగ్చి
డైలాగ్స్: మయూర్ పూరి
ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: శ్రీను
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చా మెహతా
అసోసియేట్ డైరెక్టర్: సఫ్దర్ అబ్బాస్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago