శ్రీవిష్ణు కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

Must Read

వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.39 ని ఈరోజు అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు.

“ప్రతి యువకుడి కథ”(The Story of Every Youngster) అనే అద్భుతమైన ట్యాగ్‌లైన్‌తో ఆవిష్కరించబడిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా యొక్క ఆలోచనాత్మక మరియు భావోద్వేగాలతో కూడిన ప్రపంచంలోకి ఈ పోస్టర్ ప్రేక్షకులను తీసుకొని వెళుతుంది.

తనదైన వినోదాత్మక నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, అన్ని రకాల భావోద్వేగాలను గొప్పగా పలికించగల సామర్థ్యమున్న నటుడిగా పేరుగాంచిన శ్రీ విష్ణు, ఈ సినిమాలో మరో చిరస్మరణీయ పాత్రకు ప్రాణం పోసేందుకు సిద్ధంగా ఉన్నారు.

‘అనగనగా’తో ఓటీటీలో అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు సన్నీ సంజయ్, మరో గొప్ప కథతో రాబోతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు మరియు సంతృప్తిలను అన్వేషించే కథతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రంగా నిర్మిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.39 గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, ఆకర్షణీయమైన కథాకథనాలతో ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించనుంది.

త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

కథానాయకుడు: శ్రీవిష్ణు
రచన, దర్శకత్వం: సన్నీ సంజయ్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్

Latest News

చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, అభిలాష్ రెడ్డి కంకర, యువి క్రియేషన్స్ ‘బైకర్’ నుంచి ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ 'బైకర్‌' లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా...

More News