‘ఉరుకు పటేల’ చిత్రం లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసిన శ్రీలీల‌

Must Read

హుషారు వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ తేజ‌స్ కంచ‌ర్ల‌. తేజ‌స్ చేస్తోన్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్‌. లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజర్, ‘ప‌ట్నం పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ‘ఉరుకు పటేల’ సినిమా నుంచి ‘ఓరి మాయలోడా..’ అనే లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా సాంగ్ విడుద‌లైంది. హీరో ప్రేమ‌లో ప‌డిన హీరోయిన్ త‌న మ‌న‌సులోని ప్రేమ‌ను తెలియ‌జేసే సంద‌ర్భంలో వ‌చ్చే పాట ఇది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో ‘ఓరి మాయలోడా..’ పాట‌ను స్ఫూర్తి జితేంద‌ర్ పాడ‌గా, శ్రీనివాస మౌళి రాశారు.

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కంచ‌ర్ల బాల భాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Latest News

ఏడిద నాగేశ్వరావు 9వ వర్ధంతి అక్టోబర్ 4న

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు,ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది....

More News