ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది.
‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ‘నో వే హోమ్’ సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో నేరాలతో పోరాడుతూ, సిటీని రక్షించడానికి ఒక ఫుల్-టైమ్ స్పైడర్ మ్యాన్‌గా పూర్తిగా అంకితమయ్యాడు. అయితే అతనిపై బాధ్యతలు, ఒత్తిడి పెరిగేకొద్దీ.. ఊహించని శారీరక మార్పులు అతని మనుగడకే ముప్పుగా పరిణమిస్తాయి. అదే సమయంలో నగరంలో జరుగుతున్న వింతైన నేరాల పరంపర అతనెన్నడూ ఎదుర్కోనంతటి అత్యంత శక్తివంతమైన విలన్ ముప్పుకు దారితీస్తుంది.
డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్పైడర్-మ్యాన్‌గా టామ్ హాలండ్ తిరిగి నటిస్తుండగా, జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో మరియు ట్రామెల్ టిల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, జూలై 31న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…