జిస్మత్ జైల్ మండిరెస్టారెంట్ ను ప్రారంభించిన హనీ రోస్

Must Read

హైదరాబాద్, మార్చి 2023  భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో  ఏర్పాటైన  “జిస్మత్ జైల్ మండి  అండ్ థీమ్  రెస్టారెంట్” ను  దక్షిణాది నటి  హనీ రోస్ ప్రారంభించారు.

ఈ సందర్భంలో నటుడు హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు నవాబ్ థీమ్ ఇక్కడ ఎంతో విభిన్నంగా  ఉందన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ మండి  నిర్వాహకులు, ప్రముఖ యూట్యూబర్  గౌతమి మాట్లాడుతూ ఈ మండిలో  జైల్ మరియు నవాబ్ డిజైన్ థీమ్  ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్ లో  కూర్చునే  ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు.  విజయవాడ, గుంటూరు,  వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ  జిస్మత్ మండి త్వరలో  సన్ సిటీలో  ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు.

 ప్రాంఛైజీ  నిర్వహకులు  దినేష్  మాట్లాడతూ నవాబ్ మరియు జైల్ థీమ్ తో ఏర్పాటైన  ఈ మండి రెస్టారెంట్ లో  ఛెఫ్ లు ప్రత్యేకమైన జూసి మటన్ మండి, అల్ఫాహం మండి  మరియు అరబిక్ ఫిష్ వంటి అనేక రకాల వంటకాలను అందిస్తున్నామని వివరించారు. టాలీవుడ్ నటుడు ధర్మా, శ్రీని ఇన్ ఫ్రా యం.డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News