ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ప్రతీదీ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంలో రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సన్నివేశాలు ఇలా ఎన్నెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.

ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. సూరి, సుహాస్‌లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని, లుక్స్‌ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఇందులో సుహాస్ ఓ డిఫరెంట్ పాత్రను పోషించారు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్‌లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.

ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన క్వాలిటీని అందించేందుకు టీం కష్టపడుతోంది. త్వరలోనే ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు.

నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మదిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago