ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హిందీ సహా పలు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ చిత్రాన్ని రియా షిబు నిర్మాతగా హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్, విక్రమ్, డాన్, వీటికే వంటి పలు బ్లాక్బస్టర్స్ ను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు, హిందీ చిత్రం ముంబైకర్ తో పాటూ పులి, ఇంకొక్కడు, ఏబీసీడి, సామి స్క్వేర్ వంటి భారీ చిత్రాలు నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు.థగ్స్ చిత్రంలో బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.ప్రామిసింగ్ యంగ్ హీరో హ్రిదు హరూన్ లీడ్ రోల్ లో వెండి తెరకు పరిచయం అవుతున్నారు. అమెజాన్ లో వచ్చిన క్రాష్ కోర్స్ సీరీస్ లో తన నటనతో అటు విమర్శకులను ఇటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.
త్వరలో విడుదల కానున్న హిందీ చిత్రం మంబైకర్ లో కూడా నటించి, నార్త్, సౌత్ అగ్ర నిర్మాత, దర్శకుల చిత్రాలు చేస్తున్నారు.థగ్స్ చిత్రం మ్యూజిక్, ప్రోమో కంటెంట్ ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి సోనీ మ్యూజిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ మధ్యన విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది. శామ్ సి ఎస్ సంగీతం, బి జి ఎం అందిస్తుండగా, టాప్ ఎడిటర్, ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రోమో ఎడిటర్ గా బాగా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.థగ్స్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో డిసెంబర్, 2022 లో భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అవుతోంది.