ఆకట్టుకుంటున్న సోనూ సూద్ ‘ఫతే’ సినిమా టీజర్

  • దర్శకుడిగా సోనూ సూద్ తొలి చిత్రం
  • సైబర్ నేర సామ్రాజ్యంపై పోరాటం నేపథ్యంలో ఫతే చిత్రం

విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ కథానాయకుడిగా నటిస్తూ, రచన-దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫతే’. సోనూ సూద్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఫతే చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఫతే నుంచి టీజర్ విడుదలైంది.

80 సెకన్ల నిడివి గల ఫతే టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్లెట్ల వర్షం కురిపించి, గన్ పట్టుకొని నిల్చొని ఉన్న సోనూ సూద్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ప్రారంభమైంది. ప్రతి ఫ్రేమ్ లోనూ భారీతనం కనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. వయలెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని టీజర్ స్పష్టం చేసింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ క్లాస్ లో ఉన్నాయి. సోనూ సూద్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే, వయలెన్స్ తో కూడిన అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ తో సోనూ సూద్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతోంది.

దర్శకుడిగా చేస్తున్న తొలి చిత్రానికి, సోనూ సూద్ బలమైన కథను ఎంచుకున్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి ఆసక్తికరమైన సైబర్ క్రైమ్ అంశాన్ని కథా వస్తువుగా తీసుకొని, దాని చుట్టూ బలమైన కథను అల్లుకున్నారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ సిండికేట్ ను ఢీ కొట్టి, ఆ చీకటి సామ్రాజ్యంలోని రహస్యాలను ఛేదించి, ఎందరో జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తిగా సోనూ సూద్ కనిపిస్తున్నారు.

దర్శకుడిగా మొదటి సినిమాతోనే సోనూ సూద్ తన ప్రతిభను చాటుకోబోతున్నారని టీజర్ తో స్పష్టమవుతోంది. ప్రారంభం నుంచి చివరి వరకు.. తర్వాత ఏం జరుగుతోందన్న ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసే సినిమాగా సోనూ సూద్ ఫతే చిత్రాన్ని మలుస్తున్నారు. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచడం కోసం, ఈ చిత్రం కోసం ప్రముఖ హాలీవుడ్ సాంకేతిక నిపుణులను సైతం రంగంలోకి దింపారు.

టీజర్ విడుదల సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ, “ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకుల నుండి నేను అందుకున్న ప్రేమ అసాధారణమైనది. ఇప్పుడు ఫతే టీజర్ తో మరోసారి ప్రేక్షకుల నుండి వెల కట్టలేని ప్రేమను చూస్తున్నాను. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకమైనది. ఇది దర్శకుడిగా నా అరంగేట్రం మాత్రమే కాదు.. మనలో చాలా మంది తక్కువగా అంచనా వేసే భయంకరమైన ముప్పు అయినటువంటి సైబర్ ప్రపంచంలోని అదృశ్య, చీకటి శక్తులకు వ్యతిరేకంగా ఇది ఒక వాయిస్. రియల్ కి, వర్చువల్ కి మధ్య జరిగే ఆసక్తికర ఆటను, సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా చేసే యాక్షన్ థ్రిల్లర్ ఇది. మనలో చాలా మంది చూడని యుద్ధాలను ధైర్యంగా ఎదుర్కొనే హీరోలందరి కోసం ఈ చిత్రం చేశాను.” అన్నారు.

సోనూ సూద్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్, లెజెండరీ యాక్టర్ నసీరుద్దీన్ షా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై
సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫతే చిత్రం జనవరి 10, 2025న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Tfja Team

Recent Posts

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…

2 weeks ago

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “అదే నీవు అదే నేను” టీజర్ రిలీజ్

తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…

2 weeks ago

నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ‘రక్త చరిత్ర’-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ

"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…

2 weeks ago

యతిరాజు పాత్రలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన శివాజీ

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…

2 weeks ago

సావిత్రి గారంటే తెలుగుతనం, అమ్మతనం ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో జయప్రద

సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…

2 weeks ago

‘ఐ, నోబడీ’ ప్రివ్యూ ప్రెస్ మీట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్*

‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…

2 weeks ago