‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో . స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అంకిత్ కొయ్య

అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్‌గా ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ అనే చిత్రం రాబోతోంది. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సత్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..

నిర్మాత సత్య మాట్లాడుతూ.. ‘సెన్సిబుల్ మెసెజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. టీ హబ్‌లో ఈ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాం. కొత్త కంటెంట్‌ను టాలీవుడ్‌కు ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించాం. మా చిత్రానికి పెద్ద వాళ్లు కూడా సపోర్ట్ చేశారు. దీపక్ స్లమ్ డాగ్ మిలియనీర్‌కి పని చేశారు. సింగర్ కార్తీక్ పాట పాడారు. ట్రైలర్ తరువాత మా సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వచ్చింది’ అని అన్నారు.

హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘మనం అమృతం సీరియల్‌ను ఎంత ఎంజాయ్ చేశామో అంతలా మా సినిమాను ఎంజాయ్ చేస్తాం. కొన్ని సార్లు ఎదుటి వాళ్ల కష్టాలను, బాధల్ని చూసి మనం నవ్వుకుంటాం. హర్ష అనే కారెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన తరువాత డోర్ లాక్ అవ్వడం, ఇంట్లోనే పద్నాలుగు రోజులు ఉండటంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఈ సినిమా కథ. మెయిన్ ప్లాట్ రివీల్ చేశాం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. హర్ష చెప్పిన ఈ యూనిక్ పాయింట్ నచ్చింది. అలా మా జర్నీ ప్రారంభం అయింది. పూరి జగన్నాథ్ గారి వద్ద హర్ష పని చేశాడు. మా హీరోయిన్ శ్రియ అద్భుతంగా నటించారు. మరో తెలుగమ్మాయి నటన అందరినీ ఆకట్టుకోబోతోంది. సత్య వద్ద చాలా కొత్త కొత్త ఐడియాలుంటాయి. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మంచి వాళ్లకే ఇలా లేట్ అవుతుంటాయి. క్రిష్ గారి వల్లే మా చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్లోకి రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

సహ నిర్మాత నాగు మాట్లాడుతూ.. ‘సత్య ఆర్ట్స్ బ్యానర్‌లో కో ప్రొడ్యూసర్‌గా నేను రావడం ఆనందంగా ఉంది. అంకిత్, వెన్నెల కిషోర్ గారి ట్రాక్ బాగుంటుంది. కొత్త టీంను మీడియా ప్రోత్సహించాలి, ఆదరించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.

డైరెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ‘టీ హబ్‌లో ప్రొడక్షన్ కంపెనీ ఉందని తెలిసి షాక్ అయ్యా. అక్కడకు వెళ్లి మా నిర్మాత సత్యను కలిశాను. కొత్త వాళ్లమంతా కలిసి ఈ చిత్రాన్ని తీశాం. అంకిత్‌కి కూడా ఇది సోలో హీరోగా మొదటి చిత్రం. మా లాంటి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయండి. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

16 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

16 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

16 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago