సితార కు 40 సంవత్సరాలు

Must Read

ఫూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకం పై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక కావ్యం ” సితార ” . ఈ చిత్రం విదుదలయ్యి నేటికి 40 సంవత్సరాలు అయ్యింది.

ఏప్రిల్ 27, 1984 న ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో విడులయ్యింది . పూర్ణోదయా చిత్రాలైన తాయరమ్మా బంగరయ్య , శంకరాభరణం, సీతాకొకచిలక చిత్రాలకు దర్శక శాఖలో పని చేసిన వంశీ లో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద, వంశీ కి ఈ అవకాశం ఇచ్చారు . వంశీ రచించిన ” మహల్లో కోకిల ” నవల ఆదారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది.

ఆప్పుడప్పుడే నటునిగా పైకి వస్తున్న హీరో సుమన్ ఈ చిత్ర కదానాయకుడు . ఈ చిత్రంతో భానుప్రియ చిత్రసీమకు పరిచయం అయ్యింది . ఒకప్పుడు రాజభోగం అనుభవించిన రాజా గారి వంశం ఇప్పుడు దీన స్థితిలో ఉన్నా , బయట ప్రపంచానికి మాత్రం తమ పరిస్తితులు తెలియనియ్యకుండా రాజవంశపు ఆచారాలు , ఘోషాలు, అలాగే ప్రదర్శిస్తూ ఉండే యువరాజా వారి పాత్రను ప్రముఖ నటుడు శరత్ బాబు అత్యత్భుతంగా పోషించి , తన సినీ కెరీర్లోనే ఓ గొప్ప పాత్రగా మిగిలి పోయేలా నటించారు . అలాగే శుభలేఖ సుదాకర్, ఏడిద శ్రీరాం , జే.వీ . సొమయాజులు , సాక్షి రంగారావు , రాళ్ళపల్లి , తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఈ చిత్రానికి వంశీ దర్శక ప్రతిభకు అణుగుణంగా మేస్త్రో ఇళయరాజా స్వరపరిచిన సంగీతం ఓ ప్రాణం. పాటలన్నీ ఒక ఎత్తైతే , ఈ చిత్రంలో వచ్చే silent visuals కి ఆయన చేసిన రీ రికార్డింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకి తీసుకు వెళ్ళింది, అలాగే ఎం.వీ. రఘు చాయాగ్రహణం , అనిల్ మల్నాడ్ ఎడిటింగ్.


సితార అప్పట్లో 11 కేంద్రాల్లొ 100 రోజులు ప్రదర్శింపబడింది . అలాగే 3 జాతీయ అవార్డులు గెలుచుకొంది . ఉత్తమ తెలుగు చిత్రం , వెన్నెల్లో గోదారీ అందం పాటకు గాను , ఎస్.జానకి కి ఉత్తమ నేపద్య గాయని , అనిల్ మల్నాడ్ కి ఉత్తమ ఎడిటర్ అవార్డులు గెలుచుకున్నారు . Indian Panorama లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం రష్యన్ భాషలో డబ్ చేసి అక్కడ విడుదల చెయ్యబడింది. అలాగే ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంది . ఇప్పటికీ ఈ చిత్రం తెలుగు చలన చిత్రాల్లో ఓ Cult Classic గా మిగిలిపోయింది .

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News