లాభాల్లోకి సిల్లీ మాంక్స్ – ఉద్యోగులకు ఈ సాప్స్​ ఇస్తున్నట్టు ప్రకటన

Must Read

లాభాల్లోకి సిల్లీ మాంక్స్ – ఉద్యోగులకు ఈ సాప్స్​ ఇస్తున్నట్టు ప్రకటన

స్మాల్ క్యాప్ పబ్లిక్‌ లిస్టెడ్ (ఎన్​ఎస్​ఈ) కంపెనీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామి సిల్లీ మాంక్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, నాలుగేళ్ల తరువాత లాభాల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సిల్లీ మాంక్స్ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కంపెనీ తన ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈసాప్​) ప్లాన్ వివరాలను కూడా వెల్లడించింది. కంటెంట్ పబ్లిషింగ్, డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ కంపెనీ అయిన సిల్లీ మాంక్స్ ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి 26.83 లక్షల లాభం (పన్నుకు ముందు) సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.46 లక్షల లాభం (పన్నుకు ముందు) సాధించి పెట్టుబడిదారులను ఉత్సాహపరిచింది. 2022–23 ఆర్థిక సంవత్సరం లో సంస్థకు రూ. 552.15 లక్షల నష్టం వచ్చింది. వ్యూహాత్మక పునర్నిర్మాణం, వనరుల సమర్థ వినియోగం ద్వారా సిల్లీమాంక్స్​ ఈ విజయాన్ని సాధించింది. ఈ మైలురాయి కంపెనీకి వృద్ధి స్థిరత్వాన్ని, కొత్త మార్గాన్ని సూచిస్తుంది. భారతీయ వినోద పరిశ్రమలో కీలక సంస్థగా దాని స్థానాన్ని బలపరుచుకుంది. సోమవారం జరిగిన వారి బోర్డు సమావేశంలో ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా

సిల్లీ మాంక్స్‌ సహ వ్యవస్థాపకుడు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ – “నాలుగు సంవత్సరాల తర్వాత లాభదాయకంగా మారడం సిల్లీ మాంక్స్​కు గొప్ప విజయం. మా అంకితభావంతో కూడిన బృందం, వ్యూహాత్మక కార్యక్రమాల వల్లే ఈ ఘనత సాధ్యపడింది. మేం మా కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం. స్థిరమైన వృద్ధికి అవసరమైన విభాగాలపై దృష్టి సారించాం. నిలకడతో కూడిన వృద్ధికి, విజయానికి బాటలు వేశాం. మా ఆర్థికస్థితిని మెరుగ్గా మార్చడంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానం, వ్యూహాత్మక దృష్టి చాలా కీలకం. బలమైన ప్రణాళికలు ప్రతిభావంతులైన బృందంతో బలమైన ఆర్థిక పనితీరును కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.

కేజీఎఫ్​, కేజీఎఫ్​2, కాంతార, సలార్ వంటి బ్లాక్​బ్లస్టర్​ సినిమాల విజయంలో డిజిటల్​ మార్కెటింగ్ పార్ట్​నర్​గా సిల్లీ మాంక్స్​ కీలకంగా నిలిచింది. ఈ ఏడాది 27 జూన్​లో విడుదల కానున్న కల్కి 2898 – ఏడీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ పార్ట్​నర్​. ఈ అసోసియేషన్స్ వినోద పరిశ్రమలో ప్రీమియర్ కంటెంట్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్‌గా సిల్లీ మాంక్స్ కు మరింత పేరు తీసుకొచ్చాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో సిల్లీ మాంక్స్ తన తన ఉద్యోగులను మరింత శక్తివంతం చేయడానికి, కస్టమర్ కేంద్రీకృత సంస్కృతిని పెంపొందించడానికి ఈసాప్​ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈసాప్​ విలువ మొత్తం షేర్ క్యాపిటల్‌లో ఐదుశాతం ఉంటుంది. దీని నుంచి కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల కోసం 70 శాతాన్ని కేటాయించింది. జూన్ 2024 నుంచి రాబోయే 5 సంవత్సరాలలో సమానంగా జారీ చేస్తుంది. ఈ నిర్ణయం వల్ల సిల్లీ మాంక్స్ బృంద సభ్యులు భవిష్యత్తులో కంపెనీ విజయంలో సమగ్ర వాటాదారులు అవుతారు. ఈ నిర్ణయం వారిని ప్రేరేపిస్తుంది. సిల్లీ మాంక్స్ ఎదుగుదల, ఆవిష్కరణలను కొనసాగిస్తున్నందున, కంపెనీ తన వాటాదారులకు అద్భుత విలువను అందించడానికి ఎల్లలు లేని డిజిటల్ వినోదం అందించాలనే సంకల్పంతో ఉంది.

Latest News

Priyanka Mohan’s First Look From Saripodhaa Sanivaaram

The Pan India adrenaline-filled action-adventure Saripodhaa Sanivaaram stars Priyanka Mohan playing the heroine opposite Natural Star Nani. This is...

More News