జూటోపియా 2’లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Must Read

డిస్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యానిమేటెడ్‌ చిత్రం ‘జూటోపియా 2’ హిందీ వెర్షన్‌ ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమంలో నటి శ్రద్ధా కపూర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె, సినిమాలోని ధైర్యవంతమైన మరియు చురుకైన పోలీస్‌ ఆఫీసర్‌ జూడీ హాప్స్‌కి హిందీ వాయిస్‌ ఇవ్వడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ చిత్రం నవంబర్‌ 28న భారతదేశవ్యాప్తంగా ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

https://www.instagram.com/reel/DQyUgAPjPR_/?igsh=MW91cDZpZ3RrNjZ0cg==

శ్రద్ధా మాట్లాడుతూ, జూడీ హాప్స్‌ పాత్ర తన వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉందని చెప్పింది. “జూడీ చాలా ఫోకస్‌డ్‌, ఎనర్జీతో నిండిపోయిన కేరెక్టర్‌. ఆమె సీరియస్‌గా ఉండాల్సినప్పుడు ఉంటుంది, అలాగే ఎమోషన్‌ అవసరమైనప్పుడు మృదువుగా కూడా మారుతుంది. ఆమె లాంటి పాత్రని డబ్‌ చేయడం నాకు చాలా సరదాగా, ఉత్సాహంగా అనిపించింది,” అని శ్రద్ధా వెల్లడించింది.

అలాగే, యానిమేటెడ్‌ పాత్రకి వాయిస్‌ ఇవ్వడం ఒక కొత్త మరియు స్వేచ్ఛతో కూడిన అనుభవమని ఆమె చెప్పింది. “బాల్యంలో మనం చాలామందిని అనుకరించేవాళ్లం. ఇప్పుడు ఒక ఫన్నీ, కూల్‌ బన్నీకి వాయిస్‌ ఇవ్వడం చాలా ఎంజాయ్‌మెంట్‌గా అనిపించింది. జూడీ కోపంగా ఉన్నప్పుడు, సరదాగా ఉన్నప్పుడు లేదా సీరియస్‌గా మాట్లాడినప్పుడు – ఆ ఎమోషన్‌కి తగినట్టుగా నా వాయిస్‌ని మార్చుకోవడం చాలా క్రియేటివ్‌గా అనిపించింది,”

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News