‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’  షూటింగ్ పూర్తి

 * దీపావ‌ళికి వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌

ద‌ర్శ‌క నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ష‌న్‌లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై కార్తికేయ‌న్ నిర్మిస్తోన్న చిత్రం ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  హై యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో దీపావ‌ళికి గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’మూవీ అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. అందుకు కార‌ణం.. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన జిగ‌ర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌. సినిమా ఎలా ఉండ‌బోతుందోనిన అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ ‘‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ మూవీ షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జింగ్ తండాకు ప్రీక్వెల్‌గా రాబోతున్న ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ను ఈ దీపావ‌ళికి తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. జిగ‌ర్ తండాను మించిన ఎగ్జ‌యిట్‌మెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి.  ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

స్టోన్ బెంచ్ ఫిలింస్ అధినేత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ హై యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోంది. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. దీపావ‌ళికి  భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నాం’’ అన్నారు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago