‘మహావీరుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

హీరో శివకార్తికేయ, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న  పొలిటికల్ డ్రామా మహావీరుడు. అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ లోకి వెళితే.. శివకార్తికేయన్ వార్తాపత్రికలో పనిచేసే కార్టూనిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడి పోస్టర్ చించడం వలన ఇబ్బందుల్లో పడతాడు. ఇందులో ఫాంటసీ  ఎలిమెంట్స్ కూడా వున్నాయి. శివకార్తికేయన్ పైకి చూసినపుడు భిన్నమైన వ్యక్తిగా మారడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ చాలా ఎక్సయిటింగా వుంది.

డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శివకార్తికేయన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. మిస్కిన్ విలన్‌గా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌. విధు అయ్యన్న  కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సరిత వంటి స్టార్ తారాగణం కూడా ఉంది.

ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.

తారాగణం: శివకార్తికేయన్, యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్ – శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – అరుణ్ వజ్రమోను, కుమార్ గంగప్పన్

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

3 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago