‘100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్’ తో డివైన్ మిస్టరీ థ్రిల్లర్ ‘శివం భజే’ !!

Must Read

నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’.

ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో ఇటీవల అమెజాన్ ప్రైం మరియు ఆహా లో విడుదలైన కొన్ని రోజుల్లోనే ‘100 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్’ సాధించడం విశేషం.

మల్టీ జానర్‌ కథతో, అందరినీ ఆకట్టుకునే అంశాలతో పాటు డివైన్ ఎలిమెంట్ కూడా ఉత్కంఠ రేపే విధంగా ఉండడంతో వీక్షకులు ఓటిటి లో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. కంటెంట్ బాగుంటే, చిత్రం పెద్ద తెర నుండి చిన్న తెర వరకు ఎక్కడున్నా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది అని నిర్మాత సంతోషం వ్యక్తం చేసారు.

భారీ నిర్మాణ విలువల తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితర తారాగణంతో పాటు ఇండస్ట్రీలో మేటి సాంకేతిక నిపుణులు పనిచేశారు.

ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.

Latest News

Nandamuri Balakrishna The Rage of Daaku Song from Daaku Maharaaj Released!

The lyrical video of The Rage of Daaku from the upcoming action-packed entertainer Daaku Maharaaj has been unveiled, delivering...

More News