శివ ఓ మ్యాజిక్. 4K డాల్బీ ఆట్మాస్ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది…

Must Read

-శివ ఓ మ్యాజిక్. 4K డాల్బీ ఆట్మాస్ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ రీరిలీజ్ కావడం చాలా ఆనందంగా వుంది: ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున

-శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున. ఆయన్ను తప్ప మరొకరని ఊహించుకోలేను. శివ రీరిలీజ్ 4K డాల్బీ ఆట్మాస్ లో గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: రామ్ గోపాల్ వర్మ    

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ‘శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను ‘బిఫోర్ శివ’, ‘ఆఫ్టర్ శివ’గా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్ & సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు.

రాము గారు.. 36 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో అంతే ఎక్సయిట్మెంట్ ఉంది. ముఖ్యంగా మ్యూజిక్  క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. రీరిలీజ్ కోసం సౌండ్ లో ఎలాంటి కేర్ తీసుకున్నారు?

– సౌండ్ క్యాలిటీ ఎన్హెన్స్ అయ్యిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఒరిజినల్ లో ఉండే ఫ్లేవర్ పోకుండా ఏఐ టెక్నాలజీని వాడి బెటర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వర్క్ చేసాము. అది మీ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది.

నాగార్జున గారు 36 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించింది?
-36ఏళ్ల తర్వాత రీరిలీజ్ లో ఇలా కలుస్తామని నేను కలలో కూడా అనుకోలేదు. శివకి ఇంత ఆదరణ కల్టి ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ కేర్ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది అని అంటున్నారు. ఇదంత రాము చేసిన ఎఫర్ట్. డాల్బీ అట్మాస్ కి తగ్గట్టుగా ఈ సౌండ్ ని రీ క్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీం చాలా అద్భుతంగా చేశారు. మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారు మొన్న నేను చూసి అంతే  కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది.  సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సౌండ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను సౌండ్ బాగుంది అనే టాకు శివ సినిమా కోసం విన్నాను.  

-శివ మాకు చాలా పర్సనల్. ఇది 50 ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. 50 ఇయర్స్ యానివర్సరీ రోజున సినిమాని రీరిలీజ్ చేయాలనుకున్నాం. నిజానికి పదేళ్ల క్రితమే 4కే చేసాము .అయితే అప్పుడు డాల్బీ జరగలేదు. ఇప్పుడు అన్ని హంగులతో ఒక స్పెషల్ అకేషన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇది ఏదో ప్రాఫిట్ వస్తుందని చేయలేదు. సినిమాకి ఏం కావాలో అన్ని రాము అడిగాడు. మేమిచ్చాం.

నాగార్జున గారు శివ ఒక ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ అవ్వడానికి కారణం ఏమని భావిస్తున్నారు?
-రాము స్ట్రాంగ్ విజన్, కన్వెన్షన్తో వచ్చారు. సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలాసార్లు ఎందుకు ఇది కల్ట్  సినిమా అయిందని భావిస్తుంటాను. సంథింగ్ మ్యాజిక్ జరిగింది.

నాగార్జున గారు అమల గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది?
-వెరీ నోష్టాలజిక్ ఫీలింగ్. సినిమా చూసినప్పుడు అమల ఊర్లో లేదు. couldn’t take my eyes off you అని మెసేజ్ పెట్టాను( నవ్వుతూ ) . సినిమా చూస్తున్నంతసేపు ఫెంటాస్టిక్ మెమ  సినిమాలో ప్రతిదీ గ్రేట్ మెమరీ.  

నాగార్జున గారు శివ చూసిన తర్వాత నాన్నగారు ఏమన్నారు?
-‘సినిమా చాలా పెద్ద హిట్. చాలా మంచి సినిమా చేశావ్. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో తెలియదు’ అన్నారు

రాము గారు మళ్ళీ శివ తీస్తే ఎవరితో చేస్తారు?
శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున.

నాగార్జున గారు శివ సినిమాలో ఛాలెంజింగ్ అనిపించింది ఏమిటి?
-ఇందులో ఛాలెంజ్ ఏమీ లేదు. సినిమాని చాలా ఇష్టపడి చేశాం.  శివ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతిదీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్. నేను అప్పటికే 8 సినిమాలు చేశాను.  అయినప్పటికీ శివ అనేది నాకు షూటింగ్ పరంగా కూడా కొత్త ఎక్స్పీరియన్స్.  

నాగార్జున గారు.,,  వర్మగారి మీద మీకు ఎప్పుడు  కాన్ఫిడెన్స్ వచ్చింది?
-శివ సినిమాకి ముందే రాముతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. తను నా అవుట్ డోర్ షూటింగ్స్ కి వచ్చేవాడు.  అప్పుడే ఫిక్స్ అయిపోయాం. తన కథ నచ్చింది. తన సెన్సిబిలిటీస్ కూడా నాకు చాలా ఇష్టం. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను.

నాగార్జున గారు శివ రీ రిలీజ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది.. రీ రిలీజ్ సినిమాకి ఇది  ఒక కొత్తబాట చూపిస్తుందని భావిస్తున్నారా?  
-కచ్చితంగా. మనకు ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూడాలనుకుంటున్నాం. ప్రతిభాషలో చూడాల్సిన క్లాసిక్స్ ఉన్నాయి. వాటన్నిటికీ శివ ఒక పాత్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నాను. దానికి కూడా రామునే ఆద్యుడుగా నిలుస్తాడని భావిస్తున్నాను.

నాగార్జున గారు.. ఈ సినిమా కథ అన్న రాంగోపాల్ వర్మ గారు చెప్తుంటే మీరు ఏం ఆలోచించారు?
-శివకి ముందు గీతాంజలి చేశాను.  అక్కడి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ మొదలైంది. అంతకు ముందు చేసిన సినిమాలు నాకు అంతగా నచ్చేవి కాదు.  నా క్యారెక్టర్స్ నాకు కాస్ట్యూమ్స్ నచ్చట్లేదు.ఇతర సినిమాలని దర్శకుల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు అవి  నాకు పర్సనల్ గా నచ్చట్లేదు. అలాంటి సమయంలో మణిరత్నం గారు గీతాంజలితో వచ్చారు. తర్వాత రాము శివ కథతో వచ్చారు. ఇద్దరు దర్శకులు కూడా మాస్టర్స్. వారి సెన్సిబిలిటీస్ నాకు ఇష్టం. రెండు సినిమాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.  

రాము గారు సైకిల్ చైన్ ఐడియా ఎలా వచ్చింది?
-నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తన రౌడీ కాదు. కానీ ఒక సిచువేషన్ లో తన చేతిలో వెపన్ ఉండాలనుకున్నప్పుడు,  అది నేచురల్ గా ఉండాలి. అలాంటి సమయంలో తన దగ్గరలో ఉండే ఏదైనా ఒక వెపన్ లాంటిది కావాలనుకున్నాం. అలా సైకిల్ చైన్ ఐడియా క్రియేట్ అయింది.

నాగ్ గారు శివ చూస్తున్నప్పుడు ఫ్యూచర్ లో ఇంలాంటి సినిమాలు చేయాలని ఆలోచన కలిగిందా?
-రాము శివ క్యారెక్టర్ అందులో ఉన్న హీరోయిజం గురించి ఒక నోట్ పంపించాడు. బ్యూటిఫుల్ నోట్ అది. అలాంటి క్వాలిటీస్ ఉండే క్యారెక్టర్స్ ఇకపై నేను చేయబో సినిమాల్లో పెట్టుకోవాలి. అలాంటి సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చాలా ఇన్స్పైర్ అయ్యాను.  

నాగార్జున గారు మీ వందో సినిమా ఒక కొత్త డైరెక్టర్ కి ఇవ్వడం వెనుక మీ థాట్ ప్రాసెస్ ?

నో థాట్ ప్రాసెస్. ఓన్లీ మనసుకు నచ్చింది చేయడమే. దాని గురించి పెద్దగా ఆలోచించేదేం లేదు.  

నాగార్జున గారు నాగచైతన్య అఖిల్ శివ సిమాని సీక్వెల్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా?
-వాళ్లకి అంత కరేజ్, గట్స్ ఉన్నాయని నేను అనుకోవడం లేదు (నవ్వుతూ)

రాము గారు రెండు సాంగ్స్ కట్ చేసి రీరిలీజ్ చేశారు కదా ఆ పాటలకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు?
-సౌండ్ క్వాలిటీ ఇంత పెరిగాక సాంగ్స్ స్లోడౌన్ చేస్తాయని మాకు అనిపించింది. అందుకే ఆ రెండు సాంగ్స్ తీయడం జరిగింది
అప్పుడు సినిమాలో ఐదు పాటలు ఉండాలనే ఫార్ములా ఉండేది. ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది. తీసేసాం. అయితే సినిమా ఎండ్ లో సాంగ్స్ ని అటాచ్ చేశాను. ఫ్యాన్స్ ఎంజాయ్ చేయొచ్చు (నాగార్జున)

నాగార్జున గారు నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేసే ఆలోచన ఉందా?
-రాము మీద నాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని వర్కౌట్ అయితే తప్పకుండా చేస్తాం.  

-నేను బయట ఒక హిట్ కొట్టిన తర్వాతే నాగార్జున ని అప్రోచ్ అవుతాను(రాంగోపాల్ వర్మ)

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News