స్కూల్ లైఫ్ సినిమా ప్రారంభోత్సవం -హీరో, డైరెక్టర్ పులివెందుల మహేష్

Must Read

పులివెందుల మహేష్ హీరో మరియు దర్శకుడుగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా నైనీషా క్రియేషన్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా స్కూల్ లైఫ్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో మరియు దర్శకుడుగా చేస్తున్న సినిమా. నేడు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం గారు మరియు దర్శకుడు వి సముద్ర గారు విచ్చేసి టీం ని సపోర్ట్ చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ : ఈరోజు కృష్ణానగర్ నుంచి వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం మీడియా మరియు ప్రేక్షకులు. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో అలాగే నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ చేస్తారు అని నమ్ముతాను. సినిమా ద్వారా చాలామందికి ఎంప్లాయిమెంట్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా వచ్చిన బడ్జెట్ సరిపోనప్పుడు కథ నచ్చి నన్ను నమ్మి సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఈరోజు రామానాయుడు స్టూడియోలో మూవీ ఓపెనింగ్ ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి తీసుకువచ్చిన నిర్మాత రాహుల్ త్రిశూల్ గారికి కృతజ్ఞతలు. కష్ట సమయంలో వచ్చి సపోర్ట్ ఇచ్చిన రాహుల్ త్రిశూల్ గారు ఈ సినిమాకి నిర్మాతగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. 100% సినిమా సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. అదేవిధంగా సినిమాలతో బిజీగా ఉండి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

నిర్మాత రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ : గతంలో నేను రాంగోపాల్ వర్మ సినిమా కథని ఓటిటి కి చేశాను. యాంకర్ రవి హీరోగా రాయలసీమ ప్రేమ కథ అని రెండు సినిమాలు నిర్మించాను. నిర్మాతగా ఇది నాకు మూడవ సినిమా. మహేష్ నాకు రాయలసీమ ప్రేమ కథ అప్పుడు పరిచయం. ఈ సినిమా గురించి మహేష్ చెప్పినప్పుడు కథ నచ్చి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి నేను కూడా ఒక భాగమయ్యాను. ప్రేక్షకులు ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమా కూడా ఆదరించి సక్సెస్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగస్టు 2nd స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2md వరకు సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా బిజీగా ఉండి కూడా అడగగానే సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు సముద్ర గారు మాట్లాడుతూ : ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మహేష్ కి రాహుల్ త్రిశూల్ కి ధన్యవాదాలు. రాయలసీమ నుంచి వచ్చిన ఎంతోమంది సక్సెస్ అయ్యారు అదేవిధంగా మహేష్ కూడా హీరోగా దర్శకుడుగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. గతంలో 5 సినిమాలు హీరోగా చేశాడు. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో మరియు రాహుల్ త్రిశూల్ నిర్మాత వస్తున్న ఈ స్కూల్ లైఫ్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల విజయంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు రామ్ మాట్లాడుతూ : నేను గతంలో ఏపీ 04 రామాపురం అనే సినిమాలో నటించాను. ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమాలో ఒక మంచి లీడ్ రోల్ లో నటిస్తున్నాను. మహేష్ గారు ఈ సినిమా కథ చెప్పగానే నచ్చి చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు మహేష్ గారికి కృతజ్ఞతలు. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహేష్ గారికి కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏం లేదు. ఈ రోజుల్లో సినిమాలకి కంటెంట్ ఇంపార్టెంట్. అలాంటి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా స్కూల్ లైఫ్. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈవెంట్ కొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన హీరో కిరణ్ అపవరం గారికి దర్శకుడు సముద్ర గారికి కృతజ్ఞతలు అని అన్నారు.

నటీనటులు :
పులివెందుల మహేష్, సావిత్రి కృష్ణ సుమన్, ఆమని తదితరులు

టెక్నీషియన్స్ :
నిర్మాణం : నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : నైనీషా, రాహుల్ త్రిశూల్
సహ నిర్మాత : క్రౌడ్ ఫండ్
డి ఓ పి : ధర్మ ప్రభ
సంగీతం : హర్ష ప్రవీణ్
ఎడిటర్ : నందమూరి హరిబాబు
లిరిక్స్ : ఎం అనిల్, బాలు, అసుర కె
కో డైరెక్టర్ : రాకేష్ ఏ ఆర్, కార్తీక్ కె
అసోసియేట్ డైరెక్టర్ : ఎస్.కె మాస్టర్, హరి ఎస్
రైటర్స్ : అనాస్, అప్పసాని మధు, వీరాంజనేయ చారి, సురేష్, నవీన్, నరసింహ
డైలాగ్స్ : అంజి తన్నీరు
డైరెక్షన్ డిపార్ట్మెంట్ : శివ జి, రవి కె, శివ ఎం, హర్ష, నరసింహ, గణేష్
పి ఆర్ ఓ : మధు VR

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News