ఓ మై లవ్, 18 టు 25 బళ్లారి, దర్బార్.. వంటి కన్నడ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి
టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను ఇప్పుడు తెలుగు కన్నడ భాషల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫీల్ గుడ్ మూవీస్ చేసి కన్నడ ప్రేక్షకుల మనసులో మంచి పేరు తెచ్చుకున్న స్మైల్ శ్రీను దర్శకత్వంలో వచ్చిన కన్నడ చిత్రం ఓ మై లవ్ 50 రోజులు పూర్తి చేసుకొని ఘన విజయం సాధించింది. అదే జోష్‌తో ఉన్న స్మైల్ శ్రీను ఇప్పుడు ”నాకొక పెళ్ళాం కావాలి” అనే చిత్రం ద్వారా హీరోగా రానున్నారు.
ఈ చిత్రానికి హరి అల్లినేని దర్శకుడిగా పరిచయం కానున్నారు.
ఇప్పుడు ఈ సినిమా కథకు సూటయ్యే హీరో స్మైల్ శ్రీను కి పిల్లని ( హీరోయిన్) వేతికె పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అలానే కొంతమంది చిత్ర యూనిట్ టెక్నీషయన్లును ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
ఈ సందర్భంగా హీరో స్మైల్ శ్రీను మాట్లాడుతూ.. తెలుగు కన్నడ బాషల్లో హీరోగా నా తొలి సినిమా ఇది. తెలుగులో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు హరి అల్లినేని ఇప్పటికే స్క్రిప్ట్ పని పూర్తి చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరిని అలరిస్తుంది.” అని అన్నారు.
డైరెక్టర్ హరి అల్లినేని మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్టు బాగా వచ్చింది. జనవరిలో సెట్ మీదకి తీసుకెళ్లబోతున్నాం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను, టెక్నికల్, కాస్ట్ ఆండ్ క్రూ త్వరలోనే ప్రకటించబోతున్నాం..” అని అన్నారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…